మామిళ్లగూడెం, జూన్ 14 : దళితబంధు పథకం యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సెక్టార్ యూనిట్ గ్రౌండింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రామ ప్రత్యేక అధికారులు, యూనిట్ గ్రౌండింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన చింతకాని మండలంలోని 3,427 మంది లబ్ధిదారులకు ఇప్పటికే 843 యూనిట్లు గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. దీంతో 2వేల 438 మందికి లబ్ధి చేకూరిందని తెలిపారు. ఐదు నియోజకవర్గాలలో 483 మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు 92 యూనిట్లు గ్రౌండింగ్ పూర్తి చేయడంతో 465 మంది లబ్ధిదారులకు లబ్ధి జరిగిందని తెలిపారు. మిగతా యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, నగరపాలక సంస్థ కమషనర్ ఆదర్శసురభి, డీఆర్వో శిరీష, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, ఆర్టీవో కిషన్, ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జి ఈడీ శ్రీరామ్, ఎల్డీఎం చంద్రశేఖరరావు, జేడీ వేణుమనోహార్, డీఎంహెచ్వో మాలతి, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, డీఆర్డీవో విద్యాచందన, దశరథ, జ్యోతి, విజయకుమారి, సంధ్యారాణి పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలని కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులతో బడిబాట కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నమోదులు పెంచే ముఖ్య ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో హాజరుశాతం తక్కువ ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య, జీసీడీవో ఉదయశ్రీ, ఎంఈవో రవికుమార్, రాజశేఖర్ పాల్గొన్నారు.