వైరారూరల్, జూన్14 : లబ్ధిదారులు కల్యాణలక్ష్మి చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. తహసీల్దార్ అరుణ అధ్యక్షతన మంగళవారం జరిగిన కార్యక్రమంలో వైరా పట్టణ, రూరల్ ప్రాంతాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. అనంతరం వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రాములునాయక్ డ్రైనేజీలో చెత్తను తొలగించారు. ఏ సమస్యలు ఉన్నా వెంటనే తీర్చాలని అధికారులకు సూచించారు. తొలుత శివాలయంలో స్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు.
కార్యక్రమంలో మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపాల్ చైర్మన్ సూతకాని జైపాల్, మార్కెట్ చైర్మన్ బీడీకే రత్నం, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీ కోఆప్షన్ సభ్యులు లాల్మహ్మద్, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, సర్పంచ్ అల్లిక రామారావు, మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వరరావు, దేవస్థానం చైర్మన్ మోరంపూడి బాబు, నాయకులు పసుపులేటి మోహన్రావు, మచ్చా బుజ్జి, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు అప్పం సురేశ్, మోటపోతుల సురేశ్, నాయకులు కోడూరి, అల్లిక నర్సింహారావు, నర్సింహారావు, నాగేశ్వరరావు, ఎంపీడీవో వెంకటపతిరాజు, రెవెన్యూ అధికారులు, అధికార ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
పరామర్శ : గండగలపాడులో పక్షవాతంతో బాధపడుతున్న కుటుంబాన్ని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ మంగళవారం పరామర్శించి వారికి ఆర్థిక సాయం చేశారు.