పాల్వంచ రూరల్, జూన్ 13: పట్టణాలకు దీటుగా పల్లెలనూ అభివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా సోమవారం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యతో కలిసి మండలంలోని ఉల్వనూరు, బంజర, కొత్తూరు, మల్లారం గ్రామాల్లో పర్యటించారు. ఉల్వనూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వివిధ శాఖల అధికారులు గ్రామాల్లోని సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించినప్పుడే పల్లెలు ప్రగతిపథంలో పయనిస్తాయని అన్నారు. సమస్యలను గుర్తించడంలో అధికారులు శ్రద్ధ వహించాలని సూచించారు. సమావేశంలో ప్రజల సమస్యలు తెలుసుకొని విద్యుత్, వ్యవసాయం, పోలీస్, రెవెన్యూ, మండల పరిషత్ అధికారులతో సమీక్షించారు.
వివిధ పంచాయతీలకు కేంద్రంగా ఉన్న ఉల్వనూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. పల్లెప్రకృతి వనాన్ని సందర్శించి సర్పంచ్ వాసం రుద్రను ప్రశంసించారు. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమ ఫలాలు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం అగ్రగామిగా ఉందని అన్నారు. యానంబైలు వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, తహసీల్దార్ స్వామి, ఎంపీడీవో రవీంద్రప్రసాద్, ఎంపీపీ సరస్వతి, సొసైటీ వైస్ చైర్మన్ కనకేశ్, సర్పంచులు రుద్ర, శ్రీను, బిచ్చు, నగేశ్, శాంత, పెద్దమ్మగుడి డైరెక్టర్లు చింతా నాగరాజు, వేతంశెట్టి విజయ్, అధికారులు శంకర్, ప్రతాప్, రంగా, రాంబాబు, టీఆర్ఎస్ నాయకులు విశ్వనాథం, మల్లెల శ్రీరామ్మూర్తి, చిరంజీవి, హబీమ్, త్రిదేవ్, శ్రీనివాసరెడ్డి, కొండయ్య పాల్గొన్నారు.