మామిళ్లగూడెం/ చింతకాని, జూన్ 13: మిషన్ భగీరథలోని సమస్యలను పరిష్కరించాలని మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులకు జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు సూచించారు. మిషన్ భగీరథ పనులపై ఆ శాఖ ఇంజినీరింగ్ అధికారులతో సోమవారం తన కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.
లాభసాటి యూనిట్లనే ఎంచుకోవాలి
దళితబంధు పథకం కింద లాభసాటి యూనిట్లనే ఎంచుకోవాలని, దళితుంతా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు సూచించారు. చింతకాని మండలంలోని పాతర్లపాడులో దళితబంధు లబ్ధిదారులకు ఐజాక్ మిషన్, పొక్లెయినర్, హార్వెస్టర్లను సోమవారం పంపిణీ చేశారు. అనంతరం నాగులవంచ రైతువేదికలో 8 గ్రామాలకు చెందిన దళితబంధు లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. అన్ని దళిత కుటుంబాలకూ నూరు శాతం దళితబంధు అమలు జరుగుతుందని భరోసానిచ్చారు.