మామిళ్లగూడెం, జూన్ 13: మహిళలు, చిన్నారుల రక్షణ, సురక్షితమైన సమాజం కోసం మంచి పనితీరు కనబర్చినందుకు ఖమ్మం షీటీమ్‌కు రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రతిభా అవార్డులు లభించాయి. కాగా, ఈ అవార్డు అందుకున్న ఖమ్మం షీ టీమ్‌ను ఖమ్మం సీపీ విష్ణు అభినందించారు. రెండు అవార్డులు అందుకున్న షీ టీమ్ బృందాన్ని సోమవారం సీపీ విష్ణు తన అభినందించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్రతిభ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్ర ఉమెన్ సేష్టే వింగ్ ఆద్వర్యంలో ఇటీవల ప్రకటించిన రాష్ట్రస్థాయి అవార్డుల్లో సీఐ అంజలి, ఎస్ఐ ఉమా ఆధ్వర్యంలో ఖమ్మం షీ టీమ్‌కు మొదటి స్థానం లభిచడం అభినందనీయమన్నారు.షీ టీమ్ కంప్యూటర్ ఆపరేటర్ కానిస్టేబుల్ కే.చక్రధర్‌రాజు బెస్ట్ కంప్యూటర్ ఆపరేటర్‌గా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో అవార్డు అందుకోవడం ప్రశంసనీయమని అన్నారు.