పెనుబల్లి, జూన్ 1: తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఆయన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేసి మాట్లాడారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంత వివక్షకు గురైందన్నారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనదక్షతతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఎంపీపీ లక్కినేని అలేఖ్య, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, ఏఎంసీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్‌రావు, కనగాల వెంకటరావు పాల్గొన్నారు.
విభజన హామీలను అమలు చేయాలి
తల్లాడ, జూన్ 1: రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు. తల్లాడలోని రైతువేదికలో బుధవారం ఆయన 27 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేసి మాట్లాడారు. విభజన హామీలను అమలు చేయకుండా 8 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నదన్నారు. రాష్ర్టానికి నిధులు ఇవ్వకుండా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ విధానాలను ప్రజలు తిప్పికొడతామన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరమోహన్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ భద్రరాజు, కుర్నవల్లి సొసైటీ చైర్మన్ ప్రదీప్‌రెడ్డి, సర్పంచ్‌లు సంధ్యారాణి, తూము శ్రీనివాసరావు, జొన్నలగడ్డ కిరణ్, ఓబుల సీతారామిరెడ్డి, మాగంటి కృష్ణయ్య, కోసూరి వెంకటనరసింహారావు, దిరిశాల దాసురావు, దగ్గుల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం పరిశీలన
కల్లూరు, జూన్ 1: కల్లూరు పట్టణంలో ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ స్థలంలో ఏర్పాటు చేస్తున్న ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని బుధవారం ఎమ్మెల్యే సండ్ర పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బస్సులు ప్రస్తుతం ఈ స్థలంలో ఆగి వెళ్తాయన్నారు. ఆయన వెంట రైతుబంధు సమితి సభ్యులు లక్కినేని రఘు, పసుమర్తి చందర్రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, నాయకులు రామారావు, మద్దినేని శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, నాయకులు రామవరపు ప్రసాద్, కృష్ణ పాల్గొన్నారు.