అశ్వారావుపేట టౌన్, మే 24: నేడు సమాజంలో ప్రతి ఒక్కరిలోనూ స్వలాభ పేక్ష విపరీతంగా పెరిగిపోయిందని భువనేశ్వరీ పీఠాధిపతి కమలానంద భారతీతీర్థ స్వామి సూక్తించారు. ఎప్పుడైతే వ్యక్తి స్వేచ్ఛకు దూరం పలికి సామూహిక హితం పలుకుతారో అప్పుడే రాముడు మెచ్చిన భరతరాజ్యం సాధ్యమవుతుందని ఉపదేశించారు. ప్రతి ఒక్కరూ తమలో సమాజహితాన్ని ఇముడింపజేసుకోవాలని పేర్కొన్నారు. అశ్వారావుపేటలో పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న పురాతన దాసాంజనేయస్వామివారి సన్నిధిలో త్రి సహస్రగళ సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. మూడువేల మంది భక్తులతో ఏకపఠనంతో హనుమాన్ చాలీసా పారాయణం పటించారు.
ముఖ్యతిథిగా విచ్చేసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు ముందుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ స్వాగతం పలికారు. దాసాంజనేయస్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అర్చకుడు రామకృష్ణ శాస్త్రి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం సామూహిక పారాయణం కార్యక్రమంలో పాల్గొని భక్తులతో మమేకమయ్యారు. నాయకులు, ప్రజాప్రతినిధులు రవికుమార్, జూపల్లి రమేశ్, బండి పుల్లారావు, జల్లిపల్లి శ్రీరామూర్తి, చిన్నంశెట్టి వరలక్ష్మి, చిన్నంశెట్టి సత్యనారాయణ, చిన్నంశెట్టి వెంకటనర్సింహం, చిట్లూరి ఫణీంద్ర, సత్యవరపు సంపూర్ణ, మందపాటి రాజమోహన్‌రెడ్డి, వెంకటేశ్వరావు, తాడేపల్లి రవి, చిప్పనపల్లి బజార్ పాల్గొన్నారు.