ఖమ్మం ఎడ్యుకేషన్, మే 12 :పోటీ పరీక్షలు అంటే యువతకు ఏదో తెలియని భయం. పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి? ఏం చదవాలి? ఎలా చదవాలి? స్టడీ మెటీరియల్ ఎంపిక ఎలా? ఎలాంటి ప్రణాళిక రూపొందించుకోవాలి? పరీక్షల్లో ప్రశ్నలు అడిగే విధానం ఎలా ఉంటుంది? ఒత్తిడి నుంచి బయట పడాలంటే ఏం చేయాలి? ఇలా ఎన్నో సందేహా లతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. ఈ క్రమంలో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ రైట్ ఛాయిస్ అకాడమీ సువర్ణావకాశం కల్పిస్తున్నది. యువతలోని భయాన్ని, ఆందోళనను పోగొట్ట డంతోపాటు సందేహాలు నివృత్తి చేసేందుకు నిపుణులతో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహిస్తున్నది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభం కానున్నది. ఈ సదస్సుకు సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ డైరెక్టర్ మల్లవరపు బాలలత, వేప అకాడమీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ వేప, ఖమ్మం ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు గంపా నాగేశ్వరరావు హాజరుకానున్నారు. పోటీ పరీక్షలు రాసేవారి అనుమానాలు తొలగించడం తోపాటు సన్నద్ధతపై వీరు దిశానిర్దేశం చేయనున్నారు. -ఖమ్మం ఎడ్యుకేషన్, మే 12
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఎలా చదవాలి? ముఖ్యమైన అంశాలు ఏమిటి? పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడిగే విధానం ఎలా ఉంటుంది? స్టడీ మెటీరియల్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి? నోటిఫికేషన్ విడుదల నుంచి పరీక్ష రాసే వరకు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి? అనే ప్రశ్నలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల మెదళ్లను నిత్యం తొలుస్తూ ఉంటాయి. అందుకే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికి పెట్టేందుకు, పరీక్షల విధానం, విషయ పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు సంకల్పించాయి ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంస్థలు. ఇందుకోసం ఖమ్మానికి చెందిన రైట్ ఛాయిస్ అకాడమీ సౌజన్యంతో శుక్రవారం ఉచిత అవగాహన సదస్సును నిర్వహిస్తున్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఉదయం 9 గంటలకు ఈ సదస్సు ప్రారంభం కానుంది. ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న సందర్భంగా అభ్యర్థులు కొలువు సాధించేందుకు అవసరమైన సలహాలు అందించేందుకు, సందేహాలను నివృత్తి చేసేందుకు ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంస్థలు ఇలాంటి బృహత్తర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
పరీక్షల సన్నద్ధంలో అవగాహన లేక ఉద్యోగం కోల్పోయిన వారూ ఎందరో ఉన్నారు. అలాంటి వారిని పూర్తి స్థాయిలో సంసిద్ధం చేసేందుకు సామాజిక బాధ్యతగా ఇలాంటి సదస్సులు నిర్వహిస్తున్నాయి ఈ సంస్థలు. ఇప్పటికే నాలుగు పేజీలతో నిపుణ పేరిట నిపుణుల సలహాలు, ప్రామాణిక స్టడీ మెటీరియల్ వంటివి పాఠకులకు, ఉద్యోగార్థులకు అందిస్తున్నాయి. అవగాహన సదస్సుకు హాజరయ్యే అభ్యర్థులకు వేసవి నేపథ్యంలో అసౌకర్యం కలుగకుండా ఏసీ వంటి వసతులు కల్పించారు. ఎల్సీడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు హైదరాబాద్‌కు చెందిన సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మల్లవరపు బాలలత, వేప అకాడమీ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ వేప, ఖమ్మం ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ప్రముఖ సైకాలజిస్ట్ గంపా నాగేశ్వరరావులు ప్రధాన వక్తలుగా హాజరుకానున్నారు. ఇలాంటి సదస్సులకు హాజరుకావడం వల్ల పోటీ పరీక్షల పట్ల భయాలు, అనుమానాలు తొలగిపోవడంతో పాటు ప్రిపరేషన్‌పై మరింత స్పష్టత వస్తుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులంతా ఈ అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.