కూసుమంచి, ఏప్రిల్ 4: నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి లక్ష్యంగా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మండలంలోని గోపాల్రావుపేటలో సాయి జిన్నింగ్ మిల్లులో కందాళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇస్తున్న ఉచిత కోచింగ్ కేంద్రాన్ని మంత్రి బుధవారం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, ఎంపీపీ బానోత్ శ్రీనివాస్, జడ్పీటీసీ బేబీ పాల్గొన్నారు.
ఆధునిక వ్యవసాయంతో విప్లవాత్మక మార్పులు
నూతన వ్యవసాయ విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం సాగులో విప్లవాత్మక మార్పులు చేసిందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మండలంలోని నాయకన్‌గూడెంలో 20 లక్షలతో నిర్మించిన రైతు వేదికను ఆయన ప్రారంభించారు. అనంతరం జరగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. రైతులు నూతన సాగు పద్ధతిలో సాగు చేసి ఎక్కువ లాభాలు పొందాలన్నారు. దేశంలో అతి పెద్ద ఉపాధిరంగం వ్యవసాయం దానిపై అన్ని విధాలుగా ఆలోచనలు చేసి తెలంగాణలో పండుగలా వ్యవసాయరంగాన్ని తీర్చి దిద్దామన్నారు.
రైతు పక్షపాతి ప్రభుత్వం :ఎమ్మెల్యే కందాళ
ప్రభుత్వం రైతుల పక్షపాతిగా అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఎమ్మెల్యే కందాళ అన్నారు. రైతులకు ఉపయోగపడే విధంగా రైతు వేదికల నిర్మాణాలు జరిగాయన్నారు. సమావేశంలో కలెక్టర్ పీవీ గౌతమ్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, డీఆర్డీవో విద్యాచందన, డీఏవో సరిత, ఆర్డీవో రవీంద్రనాథ్, ఎంపీపీ బానోత్ శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బానోత్ రాంకుమార్, వైస్ ఎంపీపీ కంచర్ల పద్మారెడ్డి, సర్పంచ్ కాసాని సైదులు, ఎంపీపీలు వజ్జా రమ్య, మంగీలాల్, ఏడీఏ విజయ్‌చంద్ర, ఏఈ వాణి, విద్యుత్‌శాఖ ఏడీఏ కోక్యా నాయక్, ఏఈ వెంకన్న, ఏఇవో సౌమ్య తదితరులు పాల్గొన్నారు.
జక్కేపల్లి సొసైటీని ఆదర్శంగా నిలపాలి
మండలంలోని జక్కేపల్లి సొసైటీని ఆదర్శంగా నిలపాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాలకవర్గానికి సూచించారు. రూ.49 లక్షలతో నిర్మించిన సొసైటీ కార్యాలయం, గోదాములను బుధవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే కందాళ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఇప్పటికే రూ.2 కోట్ల టర్నోవర్ ఉన్న సొసైటీని స్థానిక ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు సహకారంతో రూ.100 కోట్ల లక్ష్యానికి చేరుకోవాలని ఆకాక్షించారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు, సొసైటీ చైర్మన్‌గానే రాజకీయాల్లో వచ్చామని తెలిపారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూధన్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ శేషగిరిరావు, డైరక్టర్ శేఖర్‌రావు, అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఏవో సరిత, ఏడీఏ విజయచంద్ర, డీసీవో విజయకుమారి, ఎంపీపీ బానోత్ శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ సేట్రామ్నాయక్, సర్పంచ్ నలబోలు మాధవి, ఎంపీటీసీ బండి వెంకటనారాయణ పాల్గొన్నారు.