
ఖమ్మం అభివృద్ధి కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం ఖమ్మం రూపు రేఖలను మార్చేసింది. కేవలం పెద్ద పట్టణాల్లోనే కనిపించే స్ట్రీట్ ఆర్ట్ చిత్రాలు నేడు ఖమ్మంలోనూ కనువిందు చేస్తున్నాయి. అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించిన మంత్రి అజయ్‌కుమార్.. ఖమ్మాన్ని స్ట్రీట్ ఆర్ట్‌కి చిహ్నంగా తీర్చిదిద్దుతున్నారు. నగరానికి వచ్చిన ప్రజలు ఈ చిత్రాలు చూసి మంత్రముగ్ధులవుతున్నారు. మంత్రి ఆశయానికి అనుగుణంగా స్ట్రీట్ ఆర్ట్స్ ఆర్టిస్టులు స్వాతి, విజయ్ తమ కళా ప్రావిణ్యాన్ని ప్రదర్శించారు.
-రఘునాథపాలెం, సెప్టెంబర్ 4