ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెం సమీపంలో నిర్మితమవుతున్న నూతన కలెక్టరేట్ భవన సముదాయాల పనుల పురోగతిని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి శనివారం పర్యవేక్షించారు. అన్ని బ్లాకుల్లో కలియ తిరిగి జరుగుతున్న పనులను పరిశీలించారు. రూ.44 కోట్ల వ్యయంతో లక్షా 69 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న ఈ సముదాయాన్ని త్వరలోనే అన్ని హంగులతో జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకరానున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
భవన ప్రాంగణం ముందు భాగం మొత్తం చదును చేయాలని, నడకదారి, కాంపౌండ్ వాల్ పనులు చేపట్టాలని అధికారులను అదేశించారు. భవనం ఎదురుగా చేపట్టాల్సిన ప్లాంటింగ్, లాన్ పనులు సుందరంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేగాక పనులు పూర్తయ్యే వరకు వారంలో ఒక రోజు పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్‌కు సూచించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్, జేఈ విశ్వనాథం, కార్పొరేటర్లు కూరాకుల వలరాజు, నాగండ్ల కోటి, టీఆర్ఎస్ నాయకులు తొలుపునూరి దానయ్య, కుతుంబాక నరేశ్ పాల్గొన్నారు.