సత్తుపల్లి, వేంసూరు, వైరా, ఫిబ్రవరి 27 : పోలియో రహిత సమాజమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. జాతీయ పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ సెంటర్లో, వేంసూరు మండలం మర్లపాడులో ఆదివారం ఆయన చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కలను వేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని అన్నారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. వైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ఆయన పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతిఒక్కరూ పోలియో రహిత సమాజం కోసం కృషిచేయాలని కోరారు. గంగారం పీహెచ్సీ వైద్యులు చింతా కిరణ్ మాట్లాడుతూ సోమ, మంగళవారాల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. సత్తుపల్లి రూరల్ మండల పరిధిలోని గంగారం పీహెచ్సీలో 15వ బెటాలియన్ అదనపు కమాండెంట్ అంజయ్య పల్స్‌పోలియో కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు. తల్లాడ మండలంలో ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, సర్పంచ్ పొట్టేటి సంధ్యారాణి తల్లాడ పీహెచ్సీలో ప్రారంభించారు. కల్లూరు మండల కేంద్రం, పీహెచ్‌సీల పరిధిలోని గ్రామాల్లో సిబ్బంది చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కలు వేశారు. కల్లూరులో జడ్పీటీసీ కట్టా అజయ్‌బాబు ప్రారంభించారు. పెనుబల్లిలో ఎంపీపీ లక్కినేని అలేఖ్య, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కామేపల్లి మండలం బాసిత్నగర్లో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఎంపీపీ బానోత్ సునీత చిన్నారులకు చుక్కలు వేసి ప్రారంభించారు. కొణిజర్ల మండలంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, కొణిజర్ల పీహెచ్సీలో, అమ్మపాలెంలో జడ్పీటీసీ పోట్ల కవిత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కారేపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ మాలోత్ శకుంతల, జడ్పీటీసీ వాంకుడోత్ జగన్ పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సింగరేణి ఓపెన్‌కాస్ట్ వద్ద వలస కార్మికుల కొరకు మరో కేంద్రాన్ని అదనంగా ఏర్పాటు చేశామన్నారు. వైరా రూరల్ మండల పరిధి గ్రామాల్లో సర్పంచ్‌లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.