చర్ల, ఫిబ్రవరి 26 : ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఆత్యైస్థెర్యంతో పనిచేస్తే గెలుపు సాధ్యమవుతుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శనివారం చర్లలో జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాయకులు కార్యకర్తలను కలుపుకుని పోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు అందేలా కార్యకర్తలు చూడాలని అప్పుడే ప్రజాధారణ లభిస్తున్నదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మాట నిలబెట్టుకునే నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పదవులు శాశ్వతం కాదని నాయకులు మారొచ్చు కానీ మనం చేసిన మంచిపనులు ప్రజలు గుర్తిస్తారని అన్నారు. గిరిజనుల పట్ల సీఎం కేసీఆర్కు అభిమానం ఎక్కువగా ఉంటుందన్నారు. అందుకే తనకు ప్రభుత్వ విప్, జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారన్నారు. త్వరలో అన్ని మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. అందరి సహకారంతో పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని రేగా అన్నారు. త్వరలో జరుగనున్న ఎన్నికల్లో 5 నియోజకవర్గాల్లో పార్టీ ఘనవిజయం సాధిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనను ఇతర రాష్ర్టాలు అనుసరించే స్థాయిలో తెలంగాణ ఉందని, ఇతర రాష్ర్టాలు మనరాష్టం వైపు చూస్తున్నాయి రేగా అన్నారు.
రాజకీయాల్లో సంచలనాలను సృష్టిస్తూ పరిపాలనలో రాష్ట్ర ప్రజల అభిమానాన్ని పొందిన కేసీఆర్ దేశరాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని మహబూబాబాద్ ఎంపీ కవిత అన్నారు. కార్యకర్తలను కంటకి రెప్పలా కాపాడుకుంటామని ఆమె అన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే రానున్న ఎన్నికల్లో గెలుపు సాధిస్తామని అన్నారు. కేసీఆర్ వంటి నాయకుడి నాయకత్వంలో మనం పనిచేయడం మన అదృష్టమని అన్నారు. ప్రజాభిమానం, ఎంతో అనుభవం కలిగిన రేగా కాంతారావు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారని అందరూ సహకరించి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని ఎంపీ కవిత అన్నారు. భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, భద్రాచలం నియోజకవర్గ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
చర్ల, ఫిబ్రవరి 26 : మండలంలోని పెద్దమిడిసిలేరు పంచాయతీ గీసరెల్లి సమీపంలోని పగిడివాగుపై రూ.14.23 లక్షలతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, మహబూబాబాద్ ఎంపీ కవిత శనివారం ప్రారంభించారు. 1153 ఎకరాల గిరిజన భూములకు సాగునీటిని అందించే ఈ పథకాన్ని ఉపయోగించుకుని రైతులు అభివృద్ధి చెందాలని రైతులను కోరారు.