
మామిళ్లగూడెం/ కొత్తగూడెం క్రైం, ఆగస్టు 17: సైబర్ నేరగాళ్లకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టడంపై దృష్టి సారించినట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు, సీపీలు, ఎస్పీలు, సైబర్ క్రైం బృందాలతో వీడియో కాన్ఫరెన్సులో డీజీపీ మాట్లాడారు. హోంమంత్రిత్వశాఖ ఇటీవల ఒక జాతీయ హెల్ప్‌లైన్ నెంబర్ 155260, సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ రిపోర్టింగ్, మేనేజ్మెంట్ సిస్టమ్‌ని అమలు చేస్తోందని అన్నారు. డయల్ 100 కాల్స్‌ను సైబర్ క్రైం విభాగమైన www.cybercrime.gov.in కి అనుసంధానం చేసినట్లు చెప్పారు. డీసీసీలు ఇంజారపు పూజ, ఎల్సీ నాయక్, ఏడీసీపీలు ప్రసాద్, కుమారస్వామి, ఏసీపీలు ప్రసన్నకుమార్, రామోజీ రమేశ్ పాల్గొన్నారు. కొత్తగూడెం నుంచి ఎస్పీ సునీల్‌దత్, ఏఆర్ ఏఎస్పీ బోయిని కిష్టయ్య, ఎంటీవో సోములు, ఆర్ఐ వెల్ఫేర్ కామరాజు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, పీఆర్వో డీ.శ్రీనివాస్ పాల్గొన్నారు.