సత్తుపల్లి, ఫిబ్రవరి 24 : టీఆర్ఎస్ కార్యకర్తలను ఆదుకునేందుకు పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లి పట్టణంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన అడపా శ్రీరామమూర్తి, ఇంద్రకుమారి దంపతులు గతేడాది డిసెంబర్ 5న గ్యాస్ లీకై ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో భార్యాభర్తలు మృతిచెందారు. అదేవిధంగా గంగారం గ్రామానికి చెందిన వాడే వెంకటేశ్వరరావు చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి చనిపోయాడు. ఈ ముగ్గురికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండడంతో వారి కుటుంబ సభ్యులు రాజేశ్, తిరుపతమ్మకు ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే స్వయంగా వారి ఇంటికి వెళ్లి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన ప్రమాదబీమా సౌకర్యం కార్యకర్తల కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుందన్నారు. ఇంటిపెద్ద ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబం వీధిన పడకుండా పార్టీ ఆదుకునేందుకు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం పార్టీ కల్పించిందన్నారు. ఎన్నికలప్పుడు వచ్చే రాజకీయ పార్టీల మాదిరిగా కాకుండా కార్యకర్తల కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఆత్మచైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రఫీ, అంకమరాజు, నాయకులు గాదె సత్యం, దొడ్డా శంకర్రావు, నరుకుళ్ల శ్రీను, మధు, యోగానందం, వైస్ చైర్పర్సన్ తోట సుజలారాణి, అమరవరపు కృష్ణారావు, గాయం రాంబాబు పాల్గొన్నారు.