చింతకాని, మార్చి 25: నిరుపేదలకు అండగా సీఎం కేసీఆర్ ఉంటున్నారని గ్రామాల్లో దళితబంధు అమలుతో దళితుల జీవితాల్లో మార్పులు రానున్నాయని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. శుక్రవారం మండలంలోని మత్కేపల్లి నామవరం గ్రామంలో సర్పంచ్ తిరుపతి కొండల్రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన 20 కుటుంబాల వారు టీఆర్ఎస్లో చేరారు. వారికి లింగాల టీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలకు ఆకర్షితులై అనేక పార్టీల నుంచి నేతలు, ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ వైపు పరుగులు పెడుతున్నారన్నారు. అధికార పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తూ పాదయాత్రలతో మధిర టూరిస్టులు యత్నిస్తున్నారని, వారిని నమ్మవద్దని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, జడ్పీటీసీ కిశోర్, వైస్‌ఎంపీపీ గురజాల హనుమంతరావు, సర్పంచ్ కన్నెబోయిన కుటుంబరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, నాయకులు కిలారు మనోహర్, మంకెన రమేశ్, నూతలపాటి వెంకటేశ్వర్లు, వంకాయలపాటి వెంకట లచ్చయ్య, బొడ్డు వెంకటేశ్వరరావు, నల్లమోతు శేషగిరి, దేవరగట్ల శ్రీను, సునీత, తిరుపతి రామ్మూర్తి, చలమయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.
మధిర టౌన్, మార్చి 25: ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.4.54 లక్షల విలువైన చెక్కులను 13 మంది లబ్ధిదారులకు శుక్రవారం స్థానిక టీఆర్ఎస్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు పంపిణీ చేసి మాట్లాడారు. నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయనిధి భరోసాగా మారిందన్నారు. కార్యక్రమంలో మధిర ఏఎంసీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శి రావూరి శ్రీనివాసరావు, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కనుమూరి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ యూత్ కన్వీనర్ కోన నరేందర్‌రెడ్డి, సోషల్‌మీడియా ఇన్చార్జి తాళ్లూరి హరీష్, వార్డుకౌన్సిలర్ వైవీ అప్పారావు పాల్గొన్నారు.