ఖమ్మం, ఏప్రిల్ 18: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతోనే ఖమ్మం నగరాభివృద్ధి సాధ్యమైందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. నగరంలోని గట్టయ్య సెంటర్లో నూతనంగా నిర్మించిన నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఆయన కమిషనర్ చాంబర్‌ను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ వీపీ గౌతమ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి 15 మినీ వ్యాన్లు, 10 ట్రాక్ట ర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.22 కోట్ల వ్యయంతో నూతన మున్సిపల్ కార్యాలయాన్ని నిర్మించామన్నారు.
సీఎం కేసీఆర్ అండదండలు, మంత్రి కేటీఆర్ సహకారంతోనే ఖమ్మం నగరాభివృద్ధి సాధ్యమైందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. నగరంలోని గట్టయ్య సెంటర్లో నూతనంగా నిర్మించిన నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఆయన కమిషనర్ చాంబర్‌ను ప్రారంభించారు. కమిషనర్ ఆదర్శ్ సురభిని తన స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నూతన కార్యాలయం మంత్రి కేటీఆర్ చేతులమీదుగానే ప్రారంభించాల్సి ఉందన్నారు. పౌర సేవలకు ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతోనే అధికారుల చాంబర్లను ముందుగా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. టీఆర్ఎస్ ప్లీనరీ తర్వాత మంత్రి కేటీఆర్ పర్యటన యథాతథంగా ఉంటుందని స్పష్టం చేశారు. నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం సౌకర్యంగా లేదని, రూ.22 కోట్లతో నూతన కార్యాలయం నిర్మించామన్నారు. త్వరలో మేయర్, సుడా చైర్మన్ కార్యాలయాల ప్రారంభోత్సవం ఉంటుందన్నారు.
మరో ఐదు నెలల్లో నూతన కలెక్టరేట్‌ను ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్‌కు దీటుగా నగరం అభివృద్ధి చెందుతున్నదన్నారు. అనంతరం కలెక్టర్ వీపీ గౌతమ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి 15 మినీ వ్యాన్లు, 10 ట్రాక్టర్లను ప్రారంభించారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, మున్సిపల్ ఎస్ఈ ఆంజనేయప్రసాద్, ఈఈ కృష్ణలాల్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, పార్టీ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, కార్పొరేటర్ కమర్తపు మురళి పాల్గొన్నారు.
సిటీ లైబ్రరీగా పాత కార్యాలయం..
ఖమ్మం నగర నడిబొడ్డున ఉన్న పాత మున్సిపల్ కార్యాలయాన్ని ఇక ముందు సిటీ సెంట్రల్ లైబ్రరీగా మారుస్తామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. నగరం దిన దినాభివృద్ధి చెందుతున్నదన్నారు. నగరవాసుల సౌకర్యార్థం అత్యాధునిక లైబ్రరీ ఏర్పాటు చేస్తామన్నారు. నిరుద్యోగులకూ ఉపయోగపడేలా పోటీ పరీక్షల పుస్తకాలనూ అందుబాటులో ఉంచుతామన్నారు.