భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : రాములోరి కల్యాణ ఘడియలు సమీపిస్తుండడంతో ఆలయ కమిటీ, అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నారు. కొవిడ్ కారణంగా రెండేళ్లుగా కల్యాణ క్రతువు అంతరంగికంగానే జరిగింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో భక్తుల మధ్య వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 10న రామయ్య కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు సర్వం సిద్ధం చేశారు. 11న మహాప ట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భద్రగిరిలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అక్కడికి ఎలా చేరుకోవాలి.? బస్సులు, రైళ్ల సమయాలు, రూట్‌మ్యాప్ తదితర వివరాలతో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో జరిగే రాములోరి కల్యాణంలో ఆ మూడు రోజులే కీలక ఘట్టాలు. అవి ప్రతి భక్తుడు చూసి తరించాల్సిందే. అలాంటి మధుర ఘట్టాలను తిలకించడానికి భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 10న జరిగే రామయ్య కల్యాణానికి ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాములోరి కల్యాణాన్ని చూసి తరించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఇప్పటికే భద్రాచలం ముస్తాబైంది. భక్తులు బస్సు ఎక్కడ దిగాలి.. ఎటు నుంచి ఆలయానికి వెళ్లాలి.. పార్కింగ్ స్థలం ఎక్కడ.. ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు వీలుగా సమాచార, ప్రచారశాఖ రూట్ మ్యాప్‌ను తొలిసారిగా అందుబాటులో ఉంచింది.
సుప్రభాత సేవతో మొదలై
9వ తేదీన శనివారం ఉదయం 4 నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ, 4:30 నుంచి 5 గంటల వరకు ఆరాధన, 6 నుంచి 11:30 గంటల వరకు సర్వదర్శనం, శ్రీఘ్ర దర్శనం ఒక్కొక్కరికి రూ.100, ఉదయం 7 నుంచి 8 గంటల వరకు భద్రుడి ఆలయంలో అభిషేకం, 8:30 నుంచి 11:30 గంటల వరకు సువర్ణతులసి అర్చన, 7 నుంచి 11:30 గంటల వరకు వేదపారాయణం, 11:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్న ఆరాధన, రాజభోగం, 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వదర్శనం, శీఘ్ర దర్శనం. సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ఆరాధన, 5:30 నుంచి రాత్రి 9:30 గంటల వరకు సర్వదర్శనం, శీఘ్ర దర్శనం, 7 నుంచి 10 గంటల వరకు ఎదుర్కోలు ఉత్సవం, గరుడసేవ, 10 నుంచి 10:30 గంటల వరకు ఆరగింపు, నివేదన శాత్తుమురై, ఆలయం తలుపులు వేయుట.
తలంబ్రాల కౌంటర్లు
స్టీమర్ రోడ్ వద్ద 28, విస్తా కాంప్లెక్స్ వద్ద 10, ఆర్టీసీ బస్టాండ్ వద్ద 5, కోర్టు ఏరియా 5, మార్కెట్ యార్డు 5, కాలేజీ గ్రౌండ్ 5, ఆంజనేయ స్వామి పార్కింగ్ ఏరియా 2, బస్సుల్లో ప్రయాణించే భక్తులకు ఆర్టీసీ ద్వారా తలంబ్రాలు ఉచితంగా అందిస్తారు.
-ఉచిత భోజనాలు : దేవస్థానం అన్నదాన సత్రంతోపాటు అయ్యప్పస్వామి, తాతాగుడి సెంటర్లోని సాయిబాబా గుడి టెంపుల్, క్షత్రియ అన్నదాన సత్రం, ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రం, అంబసత్రం
మరుగుదొడ్డి, మూత్రశాలలు : ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ, కల్యాణ మంటపం పక్కన, గోదావరి నదిలోని స్నాన ఘట్టాల పక్కన, విస్తా కాంప్లెక్స్ పక్కన, వసతి సౌకర్యాల వద్ద.
ప్రాథమిక చికిత్సా కేంద్రాలు : కొత్తగూడెం బస్టాండ్, కొత్తగూడెం రైల్వేస్టేషన్, కిన్నెరసాని, సారపాక, టోల్గేట్, మార్కెట్ యార్డు, విస్తా కాంప్లెక్స్, దేవస్థానం ఏరియా, సబ్ కలెక్టర్ కార్యాలయం, తాతాగుడి సెంటర్, డిగ్రీ కాలేజీ, ఆర్డీవో కార్యాలయం, చర్ల రోడ్, యూడీ రోడ్, ఐటీడీఏ రోడ్డు, జూనియర్ కాలేజీ మైదానం, స్నానాల ఘాట్, బీఈడీ కాలేజీ, అంబేద్కర్ సెంటర్, ఎల్ఐసీ కార్యాలయం, ఆదర్శనగర్, తానీషా కల్యాణ మంటపం, సాధువుల మంటపం, ఆంజనేయస్వామి విగ్రహం వద్ద, ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ, విస్తా కాంప్లెక్స్, కల్యాణ మంటపం ఎదురుగా, తానీషా కల్యాణ మంటపం వద్ద, మార్కెట్ యార్డు.
శ్రీరామనవమి
10వ తేదీన ఉదయం 2 గంటలకు ఆలయ తలుపులు తీస్తారు. 2 నుంచి 2:30 గంటల వరకు సుప్రభాత సేవ, 2:30 నుంచి 4 గంటల వరకు తిరువారాధన నివేదన, శాత్తుమురై, 4 నుంచి 5 గంటల వరకు మూలవరులకు అభిషేకం, 5 నుంచి 5:30 గంటలకు వరకు అలంకారం, 5:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సర్వదర్శనం, శీఘ్ర దర్శనం, 8 నుంచి 9గంటల వరకు శ్రీస్వామివారికి ధ్రువమూర్తుల తిరుకల్యాణం, 9 నుంచి 9:30 గంటలకు ఉత్సవమూర్తులకు అలంకారం, 9:30 నుంచి 10:30 గంటల వరకు శ్రీసీతారామ ఉత్సవ మూర్తులకు ఆలయం నుంచి ఊరేగింపుగా కల్యాణ మంటపానికి తీసుకెళ్తారు. 10:30 నుంచి 12:30 గంటల వరకు కల్యాణ మంటపంలో శ్రీ సీతారాముల తిరుకల్యాణం ఉంటుంది.
మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట వరకు ఉత్సవ మూర్తులను కల్యాణ మంటపం నుంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొస్తారు. 1 గంట నుంచి 2 గంటల వరకు మధ్యాహ్నిక ఆరాధన, రాజభోగం, 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వదర్శనం, శీఘ్ర దర్శనం ఉంటుంది. సాయంత్రం 6 నుంచి 6:30 గంటల వరకు ఆరాధన, 6 నుంచి 7:30 గంటల వరకు శ్రీరామ పునర్వసు దీక్షాధారణ, సాయంత్రం 6:30 నుంచి 10:30 గంటల వరకు సర్వదర్శనం, శీఘ్రదర్శనం, 8 నుంచి 10 గంటల వరకు తిరువీధి సేవ, చంద్రప్రభ వాహనం, 6 నుంచి 6:30 గంటల వరకు నివేదన శాత్తుమురై, రాత్రి 10:30 గంటలకు ఆలయం తలుపులు వేస్తారు.
మహాపట్టాభిషేకం
11వ తేదీన సోమవారం ఉదయం 4 నుంచి 4:30 గంటలకు తలుపులు తీస్తారు. సుప్రభాత సేవ, 4 నుంచి 6:30 గంటల వరకు ఆరాధన, నివేదన, శాత్తుమురై, 6 నుంచి 9:30 గంటల వరకు సర్వదర్శనం, 9:30 నుంచి 10:30 గంటల వరకు శ్రీసీతారామ ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా కల్యాణ మంటపానికి తీసుకెళ్తారు. 10:30 నుంచి 12:30 గంటల వరకు మహాపట్టాభిషేకం, మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు ఉత్సవమూర్తులను కల్యాణ మంటపం నుంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు మధ్యాహ్నిక ఆరాధన, రాజభోగం, తలుపులు వేస్తారు. మళ్లీ 3 నుంచి 6 గంటల వరకు సర్వదర్శనం, శీఘ్ర దర్శనం ఉంటుంది. సాయంత్రం 6 నుంచి 6:30 గంటల వరకు ఆరాధన, 6:30 నుంచి 9:30 గంటల వరకు సర్వదర్శనం, 7 నుంచి 9:30 గంటల 10:30 ఆరగింపు, శాత్తుమురై, తలుపులు మూస్తారు.
సమాచార కేంద్రాలు
కొత్తగూడెం బస్టాండ్, కొత్తగూడెం రైల్వేస్టేషన్, కిన్నెరసాని, సారపాక, టోల్గేట్, మార్కెట్ యార్డు, విస్తా కాంప్లెక్స్, దేవస్థానం ఏరియా, సబ్ కలెక్టర్ కార్యాలయం, తాతాగుడి సెంటర్, డిగ్రీ కాలేజీ, ఆర్డీవో కార్యాలయం, చర్ల రోడ్, యూబీ రోడ్, ఐటీడీఏ రోడ్డు, జూనియర్ కాలేజీ మైదానం, స్నానాల ఘాట్, బీఈడీ కాలేజీ, అంబేద్కర్ సెంటర్, ఎల్ఐసీ కార్యాలయం, ఆదర్శనగర్, తానీషా కల్యాణ మంటపం, సాధువుల మంటపం, ఆంజనేయస్వామి విగ్రహం వద్ద, ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ, విస్తా కాంప్లెక్స్, కల్యాణ మంటపం ఎదురుగా, తానీషా కల్యాణ మంటపం వద్ద, మార్కెట్ యార్డు.
పట్టాభిషేకం దర్శనం జంటకు వెయ్యి రూపాయలే
11వ తేదీన ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కల్యాణ మంటపంలో మహాపట్టాభిషేకం జరుగుతుంది. ఇరువురికి ప్రవేశ రుసుం రూ.వెయ్యిగా నిర్ణయించారు.
బస్సుల వివరాలు…
ఖమ్మం సెక్టార్ : శ్రీశైలం ఉదయం 3:45 గంటలు
ఖమ్మం : ఉదయం 4:40 నుంచి రాత్రి 7:10 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు బస్ సౌకర్యం కలదు.
మిర్యాలగూడెం : ఉదయం 4:10, 6:15, 7:50, 11:10, 12:30, 13:30 గంటలకు
మంచిర్యాల : ఉదయం 9:45 గంటలకు
నల్గొండ : ఉదయం 11:45, 12:45, 13:45, 15:30
పరిగి : రాత్రి 18:15, 19:15
హైదరాబాద్ : ఉదయం 3:30, 7:15, 12:00, 21:30, 22:15, 10:00, 20:45, 04:45, 14:30, 15:30, 21:15
నిజామాబాద్ : 6:30, 21:00, హైదరాబాద్ 4:00, 13:00, 22:30, బీహెచ్ఈఎల్ : 8:15, 22:00, తాండూరు 18:45, 20:30, హైదరాబాద్ : 5:45, 9:30, 13:15, 14:00, 15:30, 17:15, 18:15, 20:15, 8:45, 11:00
విజయవాడ సెక్టార్ : తిరుపతి 12:00, విజయవాడ 3:00, 13:40, గుంటూరు 21:20, 13:40, విజయవాడ వరకు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10:40 గంటల వరకు ప్రతి 20 నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది.
అవనిగడ్డ : 17:15, మచిలీపట్నం 15:20, గుంటూరు 4:50, 8:20, 9:40, 12:20, 14:20, 20:00, 21:40, 22:00
రాజమండ్రి సెక్టార్ : విశాఖపట్నం ఉదయం 7:15, 9:00, 19:15, 21:00, రాజమండ్రి 4:00, 5:30, 6:30, 8:30, 9:15, 10:15, 11:00, 11:45, 12:30, 12:45, 13:15, 13:45, 14:10, 14:45, 15:15, 15:45, 16:15, 17:30, 18:30, 19:30, 21:30
హన్మకొండ సెక్టార్ : గోదావరి ఖని 7:00, 9:15, 20:30, 21:00, 17:30, 21:30, 5:00, మంచిర్యాల 19:00, మణుగూరు నుంచి కరీంనగర్ 6:45, 11:45, వేములవాడ – కామారెడ్డి 9:45, 9:45, కరీంనగర్ 14:30, 16:00
చింతూరు సెక్టార్ : కుంట 7:30, 9:00, 9:30, 10:30, 11:30, 12:00, 13:00, 13:30, 13:30, 15:30, 16:00, 17:00, జగ్దల్ పూర్ 21:30, బైలడిల్లా 20:45
ఏలూరు సెక్టార్ : భీమడోలు 6:45, అమలాపురం – రాజోలు 7:30, 20:30, నర్సాపురం 14:00
వెంకటాపురం సెక్టార్ ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి 30
నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది
రేఖపల్లి సెక్టార్ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతి 20 నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది.
రైళ్ల వివరాలు…
సింగరేణి ఉదయం 5:55 (నంబర్ 07260), సింగరేణి రాత్రి 7:50 (నంబర్ 07259), మణుగూరు ఎక్స్‌ప్రెస్ రాత్రి 10.45 (నంబర్ 127456), సికింద్రాబాద్ – మణుగూరు తెల్లవారుజామున 4:30 గంటలకు (నంబర్ 12745)
ప్రసాదాల కౌంటర్లు
కోర్టు ఏరియాలో 10, స్టీమర్‌రోడ్ ప్రవేశం వద్ద 4, రామానిలయం సీతా నిలయం, ఆంజనేయ స్వామి ఆలయం వెనుక క్యూలైన్ వద్ద, పడమట క్యూలైన్ వద్ద, ఆర్టీసీ బస్టాండ్, మార్కెట్ యార్డు.
భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు పార్కింగ్ ప్రదేశాలు
మార్కెట్ యార్డు, కూనవరం రోడ్, జూనియర్ కాలేజీ మైదానం, ఐటీడీఏ రోడ్, కొత్త కూరగాయల మార్కెట్ గ్రౌండ్, హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఎదురుగా కూనవరం రోడ్, గోదావరి బ్రిడ్జి పక్కన మెయిన్ రోడ్, మిథిలా స్టేడియం వెనుక.