మణుగూరు రూరల్, ఏప్రిల్ 6: టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్ని రంగాల అభివృద్ధి సాధ్యమవుతుందని, రైతులు, పేదల పక్షాన నిలిచిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై ఏఐటీయూసీకి చెందిన 300 మంది ఆఫ్ లోడింగ్ కాంట్రాక్ట్ కార్మికులు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో టీఆర్ఎస్లో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే రేగా గులాబీ కండువాలు కప్పారు. సాదరంగా టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ అండగా ఉండేది గులాబీ జెండా మాత్రమేనని స్పష్టం చేశారు. శ్రమించి పనిచేసే ప్రతి కార్యకర్తకూ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలూ శ్రమిస్తున్నారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం గ్రామాలన్నీ అభివృద్ధి బాట పట్టాయని అన్నారు. తెలంగాణ రైతుల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని, ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు అష్టకష్టాలూ పడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు ముత్యంబాబు, బొలిశెట్టి నవీన్, అబ్దుల్ రవూఫ్, కోట శ్రీనివాస్, వీరభద్రయ్య, వట్టం రాంబాబు, గంగారపు రమేశ్, ఎన్ఎన్ రాజు, అడపా వెంకటేశ్వర్లు, రుద్ర వెంకట్, హర్షనాయుడు, రమాదేవి, ఆఫ్ లోడింగ్ నాయకులు మహేశ్, సతీశ్, వాసు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.