కుల రహిత సమాజం కోసం కృషి చేసిన మహనీయుడాయన
ఆయన స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళితబంధు’ తెచ్చారు
జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకల్లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఢిల్లీలో పాల్గొన్న ఖమ్మం ఎంపీ నామా
ఖమ్మం, ఏప్రిల్ 5: సామాజిక న్యాయం, కుల రహిత సమాజం, బడుగుల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఆయన ఆశయం స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరూ దానిని ఆచరించాలని పేర్కొన్నారు. మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ 115వ జయంతి సందర్భంగా ఖమ్మంలోని బైపాస్‌రోడ్‌లో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మంగళవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం బాబూ జగ్జీవన్‌రామ్ అందించిన సేవలను ప్రతి ఒకరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆయన స్ఫూర్తితో సీఎం కేసీఆర్ కూడా దళితుల అభ్యున్నతి, సాధికారత కోసం దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు.
ఫలితంగా తెలంగాణలోని దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని అన్నారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, మేయర్ నీరజ, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు పగడాల నాగరాజు, ఖమర్, ఆర్జేసీ కృష్ణ, మోతారపు శ్రావణి, కర్నాటి కృష్ణ, పైడిపల్లి రోహిణి, కురాకుల వలరాజు, బట్టపోతుల సతీశ్, దోరేపల్లి శ్వేత, దాదె అమృతమ్మ, షేక్ మక్బుల్, పసుమర్తి రామ్మోహన్రావు, జక్కుల లక్ష్మయ్య, బొమ్మెర రామ్మూర్తి, కొల్లు పద్మ, తోట రామారావు, దాదే సతీశ్, లింగాల రవికుమార్, హెచ్ ప్రసాద్, మాచర్ల ఏసోబు, షకీనా, గుండ్లపల్లి శేషుకుమార్, దేవభక్తిని కిశోర్, ఎస్సీ అభివృద్ధి శాఖ డీడీ కస్తాల సత్యనారాయణ, సూపరింటెండెంట్ హమనుమంతరావు, మురళీకృష్ణ, సుంచు విజయ్, తాజుద్దీన్, కనకం భద్రయ్య, నల్లమల్ల వెంకటేశ్వరరావు, నున్నా మాధవరావు, కన్నం ప్రసన్న కృష్ణ, గుత్తా వెంకటేశ్వరరావు, లక్ష్మణ్ గౌడ్, దళిత సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా జగ్జీవన్‌కు నివాళులర్పించారు.