రైతులను అవమానించిన గోయల్ క్షమాపణ చెప్పాలి
తెలంగాణపై కేంద్రం వివక్ష
రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్
ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : పండించిన పంటలను కొనేదాకా ఉద్యమం ఆగదని, సామాన్యులపై పెనుభారం మోపుతున్న బీజీపీ ప్రభుత్వ అంతుచూసే దాకా ఆగమని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో ఇంటింటికీ నల్ల జెండాలతో నిరసన తెలిపారు. కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో 2, 3, 4 వార్డులో ఆయన శనివారం పర్యటించి నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని, రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి హోదాలో ఉండి రైతుల్ని నూకలు తినమనడం సంస్కారం కాదని అన్నారు. మీరు పాలించే ప్రాంతాల్లో నూకలు తింటున్నారా అని ప్రశ్నించారు. జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలు కొల్లు పద్మ మాట్లాడుతూ చేతకాని నాయకులు దేశాన్ని ఎలా పాలిస్తున్నారని విమర్శించారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్, కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి; డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల
పాల్వంచ, మార్చి 26 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, పెంచిన డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పాల్వంచ పట్టణ పరిధిలోని ఒడ్డుగూడెంలో శనివారం నివాస గృహాలకు నల్ల జెండాలను కట్టి నిరసన తెలిపారు. మంతపురి రాజుగౌడ్, ఎస్వీఆర్కే ఆచార్యులు, ఖాసీం, మెహబూబ్, శ్రీను, మౌలానా, మీరాబీ, సైదాబీ పాల్గొన్నారు.
నల్లజెండాల ప్రదర్శన
కొత్తగూడెం టౌన్, మార్చి 26 : లక్ష్మీదేవిపల్లి మండలంలో ఎంపీపీ భూక్యా సోనా ఆధ్వర్యంలో నల్లజెండాల ప్రదర్శన చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధరతో కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని, పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, కేంద్రం మొండి వైఖరిని విడనాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ కో-ఆప్షన్ సభ్యుడు జక్కుల సుందర్రావు, సర్పంచ్ ధరావత్ భద్రి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు లావుడ్యా రాంకోటి, ఆత్మకమిటీ డైరెక్టర్ శేషాద్రి వినోద్, హార్యతండా వార్డు సభ్యుడు బానోత్ మంగీలాల్, నాయకులు భూక్యా జాను, సీతారాం, భూక్యా భద్రు, క్రాంతి, బాలమ్మ, అమ్మి, వెంకన్న, అజ్మీరా కాశీ పాల్గొన్నారు.