-ఎమ్మెల్సీ తాతా మధు
ఎర్రుపాలెం, మార్చి 26: ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి బాటలు వేయాలని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఎర్రుపాలెంలోని స్త్రీశక్తి భవన్లో శనివారం ఎంపీపీ దేవరకొండ శిరీష అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పుష్కలంగా సాగునీటి వనరులు ఉన్నాయని, వ్యవసాయం పండుగ అయిందన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతుబీమా వంటి కార్యక్రమాలు మరే ఇతర రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు. ప్రజాప్రతినిధులు రాజకీయాలు పక్కన పెట్టి ఐకమత్యంగా పనిచేయాలన్నారు. అభివృద్ధి విషయంలో రాజీ పడొద్దని సూచించారు. అనంతరం రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సమావేశంలో మధిర ఏఎంసీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, జడ్పీటీసీ శీలం కవిత, ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ తిరుమలాచారి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీకి సన్మానం..
ఎమ్మెల్సీ హోదాలో తొలిసారిగా సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన తాతా మధును ఏఎంసీ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ, జడ్పీటీసీ శీలం కవిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, నాయకుడు మూల్పూరి శ్రీనివాసరావు గజమాలతో సన్మానించారు.
టీఆర్ఎస్ను బలోపేతం చేయాలి..
మధిర రూరల్, మార్చి 26: కార్యకర్తలు, నాయకులు టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. మండలంలోని దేశినేనిపాలెంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యక్తుల కంటే పార్టీకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలే శిరోధార్యం కావాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మధిర నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు నాయకత్వంలో పని చేయాలన్నారు. అనంతరం ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావును పరామర్శించారు. గ్రామస్తులు గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకురాగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమస్యలను జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజు దృష్టికి కూడా తీసుకెళ్లాలన్నారు. టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, పార్టీ ముఖ్యనాయకులు మొండితోక జయాకర్, చుంచు విజయ్, వేణుబాబు, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, తాళ్లూరి హరీశ్‌బాబు, సోమ రవికాంత్, శ్రీనివాసరావు, ఖాదర్, కృష్ణ, కౌన్సిలర్ అప్పారావు, వెంకటాపురం సర్పంచ్ హరికిరణ్కాంత్ పాల్గొన్నారు.