మెగా అదాలత్‌లో జిల్లా ఇన్చార్జి జడ్జీ డానీ రూథ్
ఉమ్మడి జిల్లాలో 24,278 కేసుల పరిష్కారం
ఖమ్మం లీగల్, మార్చి 12: ‘లోక్ అదాలత్‌లో సత్వరమే న్యాయం జరుగుతుంది. కేసులు కూడా సత్వరమే పరిష్కారమవుతాయి’ అని, జిల్లా ఇన్చార్జ్ న్యాయమూర్తి ఆర్.డానీ రూథ్ అన్నారు. ఖమ్మంలోని న్యాయ సేవాసదన్‌లో శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న అనేక కేసులను రాజీ మార్గంలో సత్వరమే పరిష్కరించుకునేందుకు, సముచిత న్యాయం పొందేందుకు లోక్ అదాలత్ చక్కటి వేదికగా మారిందని అన్నారు.
తొమ్మిది బెంచ్‌లు ఏర్పాటు
కేసుల పరిష్కారానికి తొమ్మిది బెంచ్‌లు ఏర్పాటయ్యాయి. 74 మోటర్ వాహన ప్రమాద కేసులను మహిళా కోర్టు న్యాయమూర్తి ఎం.శ్యాంశ్రీ పరిష్కరించి, బాధితులకు పరిహారం ఇప్పించారు. కేసుల పరిష్కారాన్ని న్యాయ సేవాసంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎంఏ జావీద్ పాషా పర్యవేక్షించారు. కొత్తగూ డెం, సత్తుపల్లి, మధిర, ఇల్లందు, భద్రాచలం, మణుగూరు కో ర్టుల్లో మొత్తం 24,278 కేసులు పరిష్కారమయ్యాయి.
మధిర టౌన్, మార్చి 12: కక్షిదారులు కక్షలు కార్పణ్యాలకు పోకుండా కేసులను రాజీ మార్గంలో సత్వరమే పరిష్కరించుకోవచ్చని, సత్వర న్యాయం పొందవచ్చని ప్రధాన జూనియర్ సివి ల్ జడ్జ్జి డి.ధీరజ్‌కుమార్ అన్నారు. మధిర మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్‌ను శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కేసుల పరిష్కారానికి రాజీయే రాచ మా ర్గమని అన్నారు. ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 48 కే సులు పరిష్కారమయ్యాయి.
నేరం అంగీకరించిన 1968 కేసు ల్లో మొత్తం రూ.1,06,690 జరిమానా విధించారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 22 కేసులు పరిష్కారమయ్యా యి. నేరం అంగీకరించిన 120 కేసుల్లో మొత్తం రూ.2,62,510 జరిమానా విధించారు. ఐదు సివిల్ కేసులు కూడా పరిష్కారమయ్యాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నాగలక్ష్మి, జన్ను భద్రయ్య, సీనియర్ న్యాయవాదులు భైరవభట్ల శ్రీనివాసరావు, వాసంశెట్టి కోటేశ్వరరావు, ఎన్.జనార్దన్‌రావు, డి.సుబ్రహ్మణ్యం, గోపాల్, గంధం శ్రీనివాసరావు, కె.పూర్ణచంద్రరావు, అవ్వా విజయలక్ష్మి, సతీష్, రాజేష్, జ్ఞానేష్, రవి, శ్రీనివాస్ పాల్గొన్నారు.