ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 6 : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు, నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు ఇన్స్పైర్, సైన్స్ ఫెయిర్‌ను జిల్లా విద్యాశాఖ నిర్వహిస్తున్నదని అందరూ సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఈవో కార్యాలయ ఏడీ వెంకటేశ్వరాచారి అన్నారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఈ నెల 13, 14, 15వ తేదీల్లో జరగనున్న ఇన్స్పైర్, సైన్స్‌ఫెయిర్ ప్రదర్శనకు సంబంధించిన సన్నాహక సమావేశం మంగళవారం మాంట్‌ఫోర్ట్ పాఠశాలలో నిర్వహించారు. వివిధ కమిటీల బాధ్యులతో సమావేశం నిర్వహించి, ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై చర్చించారు. అర్బన్ ఎంఈవో శ్రీనివాస్, సైన్స్ అధికారి బి.సైదులు, ఏఎంవో రవికుమార్, సైన్స్ ఉపాధ్యాయులు, 15 కమిటీల సభ్యులు పాల్గొన్నారు.