మధిర రూరల్, నవంబర్ 22: అభివృద్ధిలో తెలంగాణ దేశానికే రోల్‌మోడల్ అని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. మంగళవారం ఆయన ఇల్లూరులో రూ.1.50 లక్షల ఈజీఎస్ నిధులతో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణాన్ని ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాలలో రూ.17 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వైకుంఠధామాన్ని ప్రారంభించారు. వంగవీడులో రూ.5 లక్షలతో నిర్మించనున్న డ్రైన్ల పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామంలో డంపింగ్‌యార్డ్, వైకుంఠ ధామాలు, ప్రకృతి వనాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. అనంతరం ఇల్లూరు- ఖమ్మంపాడు బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ మెండెం లలిత, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు, సర్పంచ్‌లు కోట రామారావు, బొగ్గుల పద్మావతి, ఎంపీటీసీ రామకోటయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ చావా వేణు, నాయకులు చిత్తారు నాగేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, ప్రియాంక, కర్నాటి దుర్గాశ్రీనివాసరావు, కూన నరేందర్‌రెడ్డి, తాళ్లూరి హరీశ్‌బాబు, అబ్బూరి రామన్, ప్యారీ, రవి, బాబూరావు, ప్రసాద్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.