భూపాలపల్లి, నవంబర్ 20 : సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల్లోగా కారుణ్య నియామక ఉద్యోగ వయస్సు పెంపు, మా రు పేర్లు అంశం సమస్యలను పరిష్కరిస్తామని టీబీజీకే ఎస్ అ ధ్యక్షుడు బీ వెంకట్రావ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జి ల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ హౌస్‌లో భూపాలపల్లి జనరల్ బాడీ సమావేశం బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుప తి అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్ర ధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్యతో కలిసి ఆయన హాజరయ్యారు. అనంతరం వెంకట్రావ్ మాట్లాడుతూ.. వేజ్‌బోర్డులో 35 ఏండ్ల వయస్సు వరకే ఉద్యోగాలు ఇవ్వాలని జాతీయ సంఘాలు చేసిన సంతకాలతోనే ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతున్నదన్నారు.
ఈ విషయమై ఆ సంఘాల నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. గతం లో జాతీయ కార్మిక సంఘాలు కేవలం హామీలకే పరిమితమ య్యాయని పేర్కొన్నారు. తండ్రీకొడుకుల ఉద్యోగాలను తిరిగి సింగరేణిలో తీసుకొచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీబీజీకేఎస్ సంఘానికే దక్కుతుందన్నారు. మైనింగ్ స్టాఫ్ సోదరుల సమస్యలను పరిష్కరించే సత్తా కేవలం టీబీజీకేఎస్‌కే ఉందని, త్వరలోనే వాటిని తీరుస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చొరవ మేరకు సింగరేణి కార్మికులకు అనేక సంక్షేమ ఫలాలు, హక్కులు ఈ రో జు అందుతున్నాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీబీజీకేఎస్ గె లుపు ఖాయమని స్పష్టం చేశారు.
యూనియన్ ప్రధాన కార్య దర్శి మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్తా.. కసితో పనిచేసి యూనియన్ గెలుపునకు కృషి చేయాలన్నారు. ఐక్య తతో ఉంటూ సమన్వయంతో పని చేస్తూ ముందుకు సాగాలని పిలుపుచ్చారు. లోపాలు ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేయా లని సూచించారు. వచ్చే గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకే ఎస్ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని, అదే తరుణంలో భూపాలపల్లిలో కూడా యూనియన్ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చారని గుర్తు చేశారు. వీటిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బలం లేని యూనియన్లు చేసే ఆరోపణలను పట్టించుకోవద్దన్నారు. దేశంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగులకు ఇవ్వని విధంగా కేవలం ఒక సింగరేణిలోనే కార్మికులకు ఇల్లుపై బ్యాంకులో తీసుకున్న రూ.10 లక్షల రుణంపై వడ్డీ మాఫీ చేస్తున్నారని గుర్తు చేశారు. టీబీజీకేఎస్ అనేక హామీలను నెలబెట్టుకుందని, మాట నిలబెట్టుకోని సంఘాలను కార్మిక వర్గం ప్రశ్నించాలన్నారు. వీడీఏ పెరుగుదల, హెఆర్ఏ విషయంలో కేంద్ర ప్రభుత్వం, జాతీయ సంఘాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు.
యూనియన్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య మాట్లాడుతూ యూనియన్‌పై ఏఐటీయూసీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పొత్తు విష యంలలో ఇప్పటి వరకు ఎలాంటిది ఆలోచన లేదని, సీఎం కేసీఆర్, గౌరవాధ్యక్షురాలు కవిత సమక్షంలోనే ఏ నిర్ణయమైనా జరుగుతుందని స్పష్టం చేశారు. యూనియన్ కమిటీల్లో ఖాళీలను భర్తీ చే స్తామన్నారు. కొంత ఆలస్యమైనా కష్టపడిన ప్రతి నాయకుడికీ అవకాశాలు వస్తాయని చెప్పారు. మైనింగ్ స్టాఫ్ సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
భూపాలపల్లిలో గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. యూనియన్ సెంట్రల్ కమిటీ, బ్రాంచ్ కమిటీ, పిట్ కమిటీ నాయకులు బడితెల స మ్మయ్య, రత్నం సమ్మిరెడ్డి, ఏబూసి ఆగయ్య, గరిమిళ్ల శ్రీనివాస్‌రెడ్డి, దేవరకొండ మధు, కొచ్చర్ల రవికుమార్, గా జె సాంబ య్య, కుమార్, రాంచందర్, బాబుమియా, గీతాంజ లి, ప్రేమ్‌సింగ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.