సత్తుపల్లి రూరల్, వేంసూరు, నవంబర్ 13 : కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలో పలు కులసంఘాల ఆధ్వర్యంలో వనభోజనాలు నిర్వహించారు. మహిళలు, చిన్నారులు ఆయా వనసమారాధన కార్యక్రమాల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు. కమ్మ సేవాసమితి వన సమారాధనకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఐబీ రిటైర్డ్ డీఈ వంగరి పద్మారావు, కమర్తపు మురళి, శ్రీనివాసబాబు, కంకటి వెంకటేశ్వరరావు, పర్వతనేని నాగేందర్, కొత్తూరు ఉమామహేశ్వరరావు, వందనపు సత్యనారాయణ, వనమా వాసు, లక్ష్మీనారాయణ, కమ్మ సేవాసమితి ఆధ్వర్యంలో డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఎంపీపీ దొడ్డా హైమావతి, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, చలసాని సాంబశివరావు, ఉడతనేని అప్పారావు, చల్లగుళ్ల కృష్ణయ్య, చల్లగుళ్ల నర్సింహారావు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వేంసూరులో రజక, రెడ్డి, కురుమ సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా మామిడి తోటల్లో కార్తీక వనసమారాధనలు నిర్వహించి ప్రత్యేకంగా ఉసిరిచెట్టుకు పూజలు చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు, సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
కొణిజర్ల, నవంబర్13 : మున్నూరు కాపులందరూ ఐక్యతగా ఉంటేనే ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతారనిఎంపీ వద్దిరాజు రవిచంద్ర, హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్, ఆర్జేసీ విద్యాసంస్థల అధినేత గుండా కృష్ణ అన్నారు. ఆదివారం తనికెళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన వనసమారాధనలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. కార్యక్రమంలో యాసా పెద్దమునేశ్వరరావు, లేడిబోయిన గోపాలరావు, గడల రామారావు, బండి లక్ష్మీనారాయణ, గాజుల వెంకటేశ్వరరావు, ఆకుతోట ఆదినారాయణ, పాల్వంచ రామారావు తదితరులు పాల్గొన్నారు.