భద్రాచలం, నవంబర్ 13: భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాల/కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలు ఆదివారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఆదివారం జరిగిన వివిధ క్రీడాంశాల్లో విద్యార్థులు సత్తా చాటారు. అథ్లెటిక్స్ అండర్-17 విభాగంలో 100 మీటర్ల పరుగు పందెంలో పీ శ్రీతేజ భద్రాచలం ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం ఏ వైష్ణవి ఇచ్చోడు, 400 మీటర్ల పరుగు పందెంలో ఎల్లారెడ్డికి చెందిన కే నందిని ప్రథమస్థానం, ద్వితీయ స్థానం భద్రాచలానికి చెందిన కే జాహ్నవి సాధించారు.
800 మీటర్ల పరుగు పందెంలో ఎల్లారెడ్డికి చెందిన కే నందిని ప్రథమస్థానం, సిరిసిల్లకు చెందిన ఆర్ మౌనిక ద్వితీయ, 300మీటర్ల పరుగు పందెంలో ఎల్లారెడ్డికి చెందిన ఎల్ అఖిల ప్రథమ స్థానం, జడ్చర్లకు చెందిన ఎం సింథు ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. లాంగ్ జంప్‌లో భద్రాచలానికి చెందిన పీ శ్రీతేజ ప్రథమ స్థానం, జైనూర్‌కు చెందిన ఎం సరస్వతి ద్వితీయ స్థానం సాధించారు.
షాట్‌పుట్‌లో భద్రాచలానికి చెందిన శ్రీతేజ ప్రథమస్థానం, ఇంద్రవల్లికి చెందిన బీ పల్లవి ద్వితీయ స్థానం, డిస్క్‌త్రోలో కాటారానికి చెందిన వై బిందుప్రియ ప్రథమ స్థానం, ఇంద్రవెల్లికి చెందిన పీ పల్లవి ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. అండర్ -14విభాగంలో 100 మీటర్ల పరుగు పందెంలో వనపర్తికి చెందిన ఎం సాలా ప్రథమ స్థానం, చేగుంటకు చెందిన సునీత ద్వితీయస్థానం సాధించారు.
400మీటర్ల విభాగంలో ఎల్లారెడ్డి చెందిన నక్షత్ర ప్రథమ స్థానం, చేగుంటకు చెందిన బీ లావణ్య ద్వితీయ స్థానం, 600మీటర్ల విభాగంలో భద్రాచలానికి చెందిన పీ ఇంధు ప్రథమ స్థానం, ఎల్లారెడ్డికి చెందిన నక్షత్ర ద్వితీయ స్థానం, లాంగ్ జంప్‌లో భద్రాచలానికి చెందిన ఇంధు ప్రథమ స్థానం, కొత్తగూడేనికి చెందిన సబిత ద్వితీయ స్థానం, షార్ట్పుట్లో భద్రాచలానికి చెందిన ఇందు ప్రథమస్థానం, జైనూర్‌కు చెందిన సంధ్య ద్వితీయ స్థానం పొందారు. డిస్క్ త్రోలో ఆసిఫాబాద్‌కు చెందిన బీ వైశాలి ప్రథమస్థానం, తుంగతుర్తికి చెందిన జీ శ్రీదేవి ద్వితీయ స్థానం సాధించారు.
అలాగే అండర్ -19 విభాగంలో 100 మీటర్ల పరుగు పందెంలో పాలకుర్తికి చెందిన బీ వెన్నెల ప్రథమ స్థానం, ఏటూరు నాగారానికి చెందిన నికిత ద్వితీయ స్థానం, 400మీటర్ల పరుగు పందెంలో ఎల్లారెడ్డికి చెందిన హరిత ప్రథమ స్థానం, భద్రాచలానికి చెందిన పీ దివ్య ద్వితీయ స్థానం, 800మీటర్ల పరుగు పందెంలో ఎల్లారెడ్డికి చెందిన హరిత ప్రథమ స్థానం, దామరచర్లకు చెందిన ఆర్ కళావతి ద్వితీయ స్థానం, లాంగ్ జంప్‌లో ఏటూరు నాగారానికి చెందిన నిఖిత ప్రథమ స్థానం, కల్వకుర్తికి చెందిన కే దీపిక ద్వితీయ స్థానం, షాట్‌పుట్‌లో సూదిమల్లకు చెందిన కే పల్లవి ప్రథమ స్థానం, అంకంపాలెంకు చెందిన వెన్నెల ద్వితీయ స్థానం, డిస్క్ త్రోలో అంకంపాలేనికి చెందిన వెన్నెల ప్రథమ స్థానం, అంకంపాలెంకు చెందిన టీ చంద్రకళ ద్వితీయ స్థానం సాధించారు.