రఘునాథపాలెం, నవంబర్ 13: ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలేన్ని అభివృద్ధిలో జిల్లాకే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధి బూడిదెంపాడు గ్రామంలో రూ.49 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆసరా పథకం కింద మంజూరైన కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు భూక్యా గౌరి, మాళోతు ప్రియాంక, గుత్తా రవి, లక్ష్మీప్రసన్న, నాగుల్‌మీరా, వల్లభనేని సత్యవతి, తేజావత్ రాణి, అజ్మీరా వీరూనాయక్, మాదంశెట్టి హరిప్రసాద్, లక్ష్మణ్‌నాయక్, మందడపు నర్సింహారావు, మందడపు సుధాకర్, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, పిన్ని కోటేశ్వరరావు, బోయినపల్లి లక్ష్మణ్‌గౌడ్, వల్లభనేని వెంకటప్పారావు పాల్గొన్నారు.
తెలంగాణ ఏర్పాటు కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు అని, కాళోజీ నేటి తరానికి ఆదర్శమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ప్రజాకవి, పద్మ విభూషన్ కాళోజీ నారాయణరావు వర్ధంతిని ఖమ్మం బస్టాండ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ తెలంగాణలో అక్షర జ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకడిని మంత్రి గుర్తు చేశారు.