మునుగోడు నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఘన విజయం సాధించడంపై భద్రాచలం, పినపాక నియోజకర్గాల టీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం సంబురాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయాల వద్ద, ప్రధాన కూడళ్లలో టీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి స్వీట్లు పంచి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి గెలుపును అడ్డుకోలేకపోయారని, ఈ విజయం దేశ రాజకీయాలకు మలుపు అన్నారు. బీజేపీ నిరంకుశ పోకడలకు నియంత్రృత్వ విధానాలకు అవకాశవాద రాజకీయాలకు తెలంగాణ ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఆయా మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, రైతుబంధు సమితి కన్వీనర్లు, సొసైటీ, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళా సంఘ నాయకురాళ్లు, ఆయా అనుబంధ సంఘాల నాయకులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
– నమస్తే నెట్వర్క్