ఖమ్మం కల్చరల్, నవంబర్ 6 : పద్మశాలి కులస్తులు ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవడం వల్ల అభివృద్ధి సాధిస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రశంసించారు. ఆదివారం నగర సమీపంలోని చెరుకూరి మామిడితోటలో జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వన సమారాధనలో ఆయన మాట్లాడారు. వన సమారాధనలు ఐక్యత, అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన శైలజ వైద్యఖర్చుల నిమిత్తం పద్మశాలి కుల బంధువులు ఆర్థిక సాయం చేశారు. చిన్నాపెద్దా అందరు కలిసి ఆటపాటలతో అలరించారు. బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్లాదపర్చాయి. కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు, కార్పొరేటర్ కమర్తపు మురళి అధ్యక్షత వహించగా, బొమ్మ రాజేశ్వరరావు, శ్రీనివాసబాబు, జనార్దన్, శ్రీనివాస్, సత్యనారాయణ, సునీత, సంధ్యారాణి, కొండలరావు పాల్గొన్నారు.
రఘునాథపాలెం, నవంబర్ 6 : ఖమ్మం నెహ్రూనగర్‌లో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన శ్రీరక్ష ఆసుపత్రిని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదివారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఎమర్జెన్సీ, మల్టీ స్పెషాలిటీ, డయాలసిస్, యూరాలజీ విభాగాలతో ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చిన ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో మేయర్ పునకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, ఐఎంఏ వర్కింగ్ కమిటీ సభ్యుడు డాక్టర్ శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ డాక్టర్ బాగం కిషన్‌రావు, సెక్రటరీ డాక్టర్ సురేశ్, డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ అజయ్‌కుమార్ పాల్గొన్నారు.
ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్ 6 : టీఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే అప్జల్ హాసన్, ఆర్వీఎస్ సాగర్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షుడు నందగిరి శ్రీనుకి కేంద్ర సంఘం ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ని మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో రెవెన్యూ సంఘం జిల్లా అధ్యక్షుడు సునిల్‌రెడ్డి, టీఎన్జీవో జిల్లా కోశాధికారి భాగం పవన్‌కుమార్, దాసరి రవి, నాగులమీరా, వై శ్రీనివాసరావు, ఆర్ఎన్ ప్రసాద్, దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు.