రఘునాథపాలెం, నవంబర్ 2 : ఖమ్మం నగరంలో వాణిజ్య వ్యాపార సంస్థలు చెల్లించాల్సిన ట్రేడ్ లైసెన్స్ ఫీజులపై నగరపాలక సంస్థ అధికారులు బుధవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో కమిషనర్ ఆదర్శ్ సురభి పాల్గొని కమాన్బజార్ ప్రాంతంలోని పలు షాపులను తనిఖీ చేశారు. ఎవరెవరు ఎంతెంత ఫీజులు చెల్లించాలి.. ఉన్న బకాయిలపై ఆరా తీశారు. బకాయిదారుల వివరాలను నమోదు చేసుకున్నారు.
ఇందుకోసం శానిటేషన్ ఇన్స్పెక్టర్, బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లతో కలిపి మొత్తం 5 బృందాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఈ బృందాలు నాలుగురోజులపాటు నగరంలో పర్యటించి వాణిజ్య దుకాణాల ట్రేడ్ లైన్స్ల ఫీజులపై డ్రైవ్ నిర్వహించాలన్నారు. తొలిరోజు కమాన్బజార్లో జరిగిన డ్రైవ్లో ఆర్ఐలు జీ శ్రీనివాసరావు, కే శ్రీనివాసరావు, బిల్ కలెక్టర్లు రామయ్య, జగదీశ్, శానిటరీ ఇన్స్పెక్టర్ మల్లయ్య, కంప్యూటర్ ఆపరేటర్ ఎన్.శంకర్, చైతన్య ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.