సత్తుపల్లి, అక్టోబర్ 26 : విధి నిర్వహణలో, దేశశాంతిభద్రతల రక్షణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల ఆత్మశాంతికి సత్తుపల్లిలో ఏసీపీ వెంకటేశ్, గంగారం 15వ బెటాలియన్‌లో కమాండెంట్ జమీల్‌పాషా ఆధ్వర్యంలో బుధవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఏసీపీ వెంకటేశ్ జవహర్‌నగర్ కృష్ణమందిరం నుంచి, బెటాలియన్ కమాండెంట్ గంగారంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ రక్షణకు అసువులు బాసిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ శాంతి ర్యాలి నిర్వహించామన్నారు.
పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమరుల కుటుంబాలకు వారు నివాళులర్పించి కుటుంబసభ్యులకు బాసటగా నిలుస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సై రాము, ఏఎస్సై జయబాబు, బెటాలియన్ అదనపు కమాండెంట్ అంజయ్య, సహాయ దళాధిపతులు ఉదయభాస్కర్, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, పీఆర్వో సాయిబాబు, ఆర్ఎస్సైలు, ఏఎస్సైలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వైరాటౌన్, అక్టోబర్ 26 : పోలీస్ అమరవీరుల త్యాగం మరువలేనిదని ఏసీపీ రెహమాన్ అన్నారు. బుధవారం వైరాలో అమరవీరుల దినోత్సవం సందర్భంగా వైరా రింగు రోడ్డు నుండి పాత సెంటర్, మధిర రోడ్డు వరకు వైరా సబ్‌డివిజన్ పోలీస్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో మాట్లాడారు. కార్యక్రమంలో వైరా, మధిర సీఐలు తాటిపాముల సురేశ్, మురళి, సబ్‌డివిజన్ ఎస్సైలు శాఖమూరి వీరప్రసాద్, పి.సురేశ్, వెంకన్న, యయాతి రాజు, కవిత, మేడా ప్రసాద్, పొదిలి వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు.