మధిర, అక్టోబర్ 26 : పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. బుధవారం ఆయన నాలుగున్నర కోట్లతో చేపట్టిన ట్యాంక్‌బండ్ పనులు, వెజ్‌నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల వివరాలను సంబంధిత ఏఈ నరేశ్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ట్యాంక్‌బండ్‌పై సెంట్రల్‌లైటింగ్, వెజ్ నాన్‌వెజ్ మార్కెట్లోకి వాహనాల రాకపోకలకు స్థలం కేటాయింపులపై ఆరా తీశారు.
నాన్వెజ్మార్కెట్లో చేపల అమ్మకందారులు బయట పెట్టకుండా వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించి డ్రైనేజి వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు కరివేద సుధాకర్, మల్లాదివాసులను నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పనులు పూర్తయితే మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రానున్నట్లు తెలిపారు. అనంతరం డిగ్రీ కళాశాల పక్కన వంద పడకల ఆసుపత్రి, కళాశాల క్రీడాప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణాలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇప్పటికే పనులు ఆలస్యమయ్యాయని, వేగవంతం చేయాలని అన్నారు.
అనంతరం కలెక్టర్‌కు సైదల్లిపురం గ్రామసర్పంచ్ చిట్టిబాబు గ్రామంలో డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, కేటాయించిన ఇళ్ల లబ్ధిదారులు ఉండడం లేదని, వాటిని విక్రయించేందుకు సిద్ధమయ్యారని వినతిపత్రాన్ని అందజేశారు. స్పందించిన కలెక్టర్ ఎక్కడో ఉంటూ ఇక్కడ నివాసం ఉండని వారి వివరాలు గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించారు. మధిర పట్టణంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని బెజవాడ రవిబాబు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్నేహలతమొగిలి, ఆర్డీవో రవీంద్రనాథ్, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, చైర్పర్సన్ మొండితోక లత, ఎంపీపీ మెండెం లలిత, ఖమ్మం ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో కుడుముల విజయభాస్కర్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బోనకల్లు, అక్టోబర్ 26 : ‘మన ఊరు- మన బడి’కి ఎంపికైన ముష్టికుంట్ల ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ వీపీ గౌతమ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఎటువంటి పనులు చేపట్టకపోవడంతో మండల అధికారులు, సంబంధిత శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. పనులు పూర్తికావాల్సిన సమయం అయినప్పటికీ ఎందుకు చేపట్టలేదని, వెంటనే పనులు చేపట్టి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించారు. పాఠ్యాంశాలు ఎలా బోధిస్తున్నారు, ఎలా చదువుకుంటున్నారు అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రావూరి రాధిక, ఎంపీడీవో వేణుమాధవ్, ఎంపీవో శాస్త్రీ, మండల ఏఈ నవీన్‌కుమార్, సర్పంచ్ షేక్ బీజాన్బీ, హుస్సేన్, మాజీజడ్పీటీసీ బానోత్ కొండ, ఆర్ఐ సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.