కొణిజర్ల, ఫిబ్రవరి 3 : రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నదని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు గురువారం పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేదలు కార్పొరేట్ స్థాయిలో చికిత్స పొందేలా సీఎంఆర్ఎఫ్ రూపకల్పన చేశారన్నారు. దేశంలో మరెక్కడా లేని వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అన్ని వర్గాల సంక్షేమ బాధ్యతను నెత్తినవేసుకున్నారన్నారు. తహసీల్దార్ సైదులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ వైస్‌చైర్మన్ బొర్రా రాజశేఖర్, జడ్పీటీసీ పోట్ల కవిత, సర్పంచ్ సూరంపల్లి రామారావు, ఎంపీటీసీ కొణకంచి స్వర్ణలత, సొసైటీ చైర్మన్ చెరుకుమల్లి రవి, రైతు బంధు సమితి అధ్యక్షుడు కిలారు మాధవరావు, సర్పంచ్‌లు పరికపల్లి శ్రీను, రోశన్బేగ్, రాయల నాగేశ్వరరావు, షేక్ అఫ్జల్‌బీ, ఎంపీడీవో రమాదేవి, టీఆర్ఎస్ నాయకులు పోట్ల శ్రీనివాసరావు, డేరంగుల బ్రహ్మం, కొచ్చర్ల భిక్షం, షేక్ మౌలానా, పోగుల శ్రీను, ధరావత్ బాబులాల్, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సక్రియ మృతికి ఎమ్మెల్యే నివాళి : తీగలబంజర గ్రామానికి చెందిన ధరావత్ సక్రియ ఇటీవల మృతి చెందాడు. గురు వారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ పాల్గొని సక్రియ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.