కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 22 : భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు సోమవారం ఘనంగా జరిగింది. తెలంగాణ ఆటోడ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ నుంచి మొర్రేడువాగు వంతెన వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో బాబా, నరేశ్, గిరి, చంటి, వెంకట్, జాని, మాటేటి హుస్సేన్, మాధవరావు, కనకరాజు, శాంతి, శ్రీకాంత్, సంపత్ పాల్గొన్నారు.
కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 22 : కొత్తగూడెం మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. 19వ వార్డు మేదరబస్తీలో కౌన్సిలర్ బండి నరసింహారావు ఆధ్వర్యంలో ఇంటింటికీ నాలుగు మొక్కల చొప్పున అందించారు. వార్డు ఆఫీసర్ చంద్రమౌళి, వార్డు ఆర్పీ రాధిక, అంగన్వాడీ టీచర్ లక్ష్మి, వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కొత్తగూడెం ఎడ్యుకేషన్, ఆగస్టు 22 : ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన సాంస్కృతిక, ఆటలు, పాటలు, క్రీడా పోటీల విజేతలకు ప్రిన్సిపాల్ కత్తి రమేశ్ బహుమతులు, మెమెంటోలు, సర్టిఫికెట్లను అందించారు. విద్యార్థులు చదువుతోపాటు అన్నిరంగాల్లో రాణించాలని, క్రీడల పట్ల ఆసక్తి చూపించాలని, క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. అధ్యాపకులు కిరణ్కుమార్, బండి లక్ష్మణ్, శ్రీరాములు, బండి వెంకటేశ్వరరావు, నర్సింహారావు, రాజేందర్, సాయినాథ్, సముద్రాల శ్రీనివాస్, ఎం.పవన్, సంతోష్, ఝాన్సీ, జ్యోతి, స్వప్న, లింగయ్య పాల్గొన్నారు.
పాల్వంచ, ఆగస్టు 22 : హైదరాబాద్లో జరిగిన ముగింపు వేడుక పాల్వంచ నుంచి ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, పాల్వంచ జడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, కొత్తగూడెం సొసైటీ అధ్యక్షుడు మండే వీరహనుమంతరావు, పాల్వంచ ఎంపీపీ మడివి సరస్వతి హాజరయ్యారు. కొత్వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించిందని, విద్యార్థుల్లో దేశభక్తిని కలిగించేందుకు గాంధీజీ సినిమాను చూపించడం విశేషమన్నారు.
పాల్వంచ, ఆగస్టు 22 : పాల్వంచ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులతోపాటుగా ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ చింతా శ్రీకాంత్ కోరారు. మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన వేడుకలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు 15 రోజులపాటు స్వతంత్ర వజ్రోత్సవాలను దిగ్విజంగా జరుపుకున్నామని, సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రతిఒక్కరూ పట్టణ పరిశుభ్రత, పచ్చదనంపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవో కనకదుర్గ, కరాటే క్రీడాకారిణి సింధు తపస్వి పాల్గొన్నారు.