అన్నపురెడ్డిపల్లి, జూలై 29: జిల్లాలోని పలు మండలాల్లో చోరీలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అతని నుంచి రూ.3.73 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ 3న మండలంలోని ఎర్రగుంటలో చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అన్నపురెడ్డిపల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కొత్తగూడెం బస్టాండ్ ఆవరణలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. సుజాతనగర్, అశ్వాపురం, అన్నపురెడ్డిపల్లి, జూలూరుపాడు చోరీ కేసుల్లో రూ.3.73 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఒడిశాకు చెందిన భాలై దళిగా గుర్తించారు. నిందితుడిపై ఆరు కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు. చోరీ కేసును ఛేదించిన సీఐ వసంతకుమార్తో పాటు సీసీఎస్ సీఐ వేణుచందర్, సీసీఎస్ ఎస్సై మహేశ్, అన్నపురెడ్డిపల్లి ఎస్సై విజయ పాల్గొన్నారు.