మణుగూరు రూరల్/మణుగూరు టౌన్, జూలై 29: వరద బాధితులకు శనివారం నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీటిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం పరిశీలించారు. పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లోని 13,000 కుటుంబాలకు నేరుగా నిత్యావసర సరుకులు అందించేందుకు ఏర్పాట్లు జరిగాయి.
ఈ సరుకులను అందించేందుకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీలు బండి పార్థసారథి రెడ్డి, నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, తాతా మధు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య రానున్నారు. టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాం తారావు శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. బాధితులందరికీ సరుకులు అందించాలన్నారు.
భద్రాచలం, జూలై 29: భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మానుకోట ఎంపీ కవిత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర రెడ్డి, తాతా మధు తదితరులు శనివారం వస్తారని టీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం పినపాక మండల పర్యటనకు వెళ్తారని పేర్కొన్నారు.
మణుగూరు రూరల్, జూలై 29: మణుగూరులో గురుకుల పాఠశాలల నిర్వహణ కోసం భవనాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం సింగరేణి ఏరియా అధికారులతో కలిసి పరిశీలించారు. పీవీ కాలనీలోని సింగరేణి హైస్కూల్‌ను సందర్శించి అధికారులతో మాట్లాడారు. బీసీ, ఎస్సీ గురుకుల పాఠశాలలను మణుగూరులో ఏర్పాటు చేయడానికి అనువైన స్థలం, ఆట స్థలంపై చర్చిం చారు. ఏరియా జీఎం జక్కం రమేశ్, టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు వి.ప్రభాకర్‌రావు, జడ్పీటీసీ సభ్యుడు పోశం నర్సింహారావు పాల్గొన్నారు.
మణుగూరు రూరల్, జూలై 29: భధ్రాచలం సుభాష్‌నగర్‌కు చెందిన ఖాసీంకు సీఎంఆర్ఎఫ్ చెక్కును ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం మణుగూరులోని తన క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు పోశం నర్సింహారావు, ఎంపీపీ గుమ్మడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.