జూలూరుపాడు, జూలై 29: దళితుల ఇళ్లలో వెలుగులు నింపేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు లాంటి పథకం దేశంలో మరెక్కడాలేదని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. అర్హులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. అర్హులైన దళితులందరికీ ఈ పథకాన్ని దశలవారీగా అందిస్తామని అన్నారు. జూలూరుపాడు మండలానికి మంజూరైన 17 దళతబంధు యూనిట్లను మండలం కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు అందజేశారు.
ఈ పథకం కింద లబ్ధిదారులు మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకున్న సిమెంటు, పెయింటింగ్, ఫ్యాన్సీ, ఫొటో స్టూడియో, ఎలక్ట్రికల్ దుకాణాల యూనిట్లను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తొలుత టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మండలం కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వెంగన్నపాలెం గ్రామంలోని ఏవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వాహనాలను లబ్ధిదారులకు అందజేశారు.
అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. దళితబంధు పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు అందిస్తున్నందున వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ముత్యం, భీమ్లానాయక్, లూథర్ విల్సన్, తాళ్లూరి రవి, లావుడ్యా సోని, భూక్యా కళావతి, గాదె నిర్మల, లేళ్ల వెంకటరెడ్డి, పొన్నెకంటి సతీశ్‌కుమార్, దుద్దుకూరి మధుసూదన్‌రావు, పెండేల రాజశేఖర్, గలగె సావిత్రి, బానోత్ నర్సింహారావు, విజయ, కిషన్‌లాల్, ముక్తి నర్సింహారావు, బోడా కైక, శాంతిరాం యదళ్లపల్లి వీరభద్రం, చౌడం నర్సింహారావు, వేల్పుల నర్సింహారావు, గిరిబాబు, రోకటి సురేశ్, మోదుగు రామకృష్ణ, రామిశెట్టి రాంబాబు, మల్లెల నాగేశ్వరరావు, ధరావత్ రాంబాబు, దేవరకొండ కిరణ్, నర్వినేని పుల్లారావు, లాలూనాయక్, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.