సారపాక, జూన్ 11: మండలంలోని తాళ్లగొమ్మూరు, కోయగూడెం, ఇరవెండి, మోతే పట్టీనగర్ గ్రామాల్లో శనివారం పల్లె ప్రగతి పనులు జరిగాయి. వీటిని సర్పంచులు కొయ్యల పుల్లారావు, తుపాకుల రామలక్ష్మి, పోతునూరి సూరమ్మ, కొర్సా లక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించారు.
మణుగూరు టౌన్, జూన్ 11: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా తడి-పొడి చెత్త సేకరణపై పట్టణంలోని బాలాజీనగర్, సుందరయ్య నగర్లో మెప్మా సిబ్బంది శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కె.మాధవి, మెప్మా కోఆర్డినేటర్ నాజర్, వార్డు స్పెషలాఫీసర్ గోపీప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం, జూన్ 11: మండలంలో ప్రగతి పనులను ఎంపీవో ముత్యాలరావు పరిశీలించారు. తూరుబాక, నర్సాపు రం, రేగుబల్లి, గంగోలు గ్రామాల్లో సైడ్డ్రైన్లలో పూడిక తీశారు.
అశ్వాపురం, జూన్ 11: స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పారిశుధ్య పనులను సర్పంచ్ బానోత్ శారద పర్యవేక్షించారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
కరకగూడెం, జూన్ 11: మండలంలోని రేగళ్లలో రహదారికి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కల తొలగింపు పనులను సర్పంచ్ కుంజా వసంతరావు ప్రారంభించారు. హరితహారం మొక్కలు నాటేందుకు గుంతలు తీయించారు.
చండ్రుగొండ, జూన్ 11: పల్లెప్రగతి నిరంతర పక్రియ అని ఎంపీడీవో అన్నపూర్ణ అన్నారు. శనివారం మద్దుకూరు పంచాయతీలోని నర్సరీని సందర్శించారు. గ్రామంలోని చెత్తను ట్రాక్టర్ల ద్వారా ప్రతి రోజూ డంపింగ్షెడ్కు తరలించాలన్నారు. డ్రైనేజీలు శుభ్రంగా ఉంటేనే రోగాలు రావన్నారు.