మణుగూరు టౌన్, జూన్ 10: మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం స్థానిక సింగరేణి స్టోర్ సమీపంలోని కబరస్తాన్, ఈద్గాను ముస్లిం మత పెద్దలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని కబరస్తాన్, ఈద్గాల చుట్టుపక్కల ప్రహరీ నిర్మాణం, మంచినీటి సౌకర్యానికి నిధులు కేటాయిస్తానన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా ముస్లిం మైనార్టీల కోసం ప్రభుత్వం షాదీముబారక్ పథకం ప్రవేశపెట్టి నిరుపేదలకు అండగా నిలిచిందన్నారు. క్యాక్రమంలో జడ్పీటీసీ పోశం నర్సింహారావు, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ జావిద్ పాషా, మైనార్టీ నాయకులు హబీబ్, ఇస్మాయిల్, యూసఫ్, బాబ్జాన్, హాజీ, టీఆర్ఎస్ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, ముత్యం బాబు, యాదగిరిగౌడ్, బొలిశెట్టి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
మున్నూరు కాపులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాయలయంలో కాపు కులస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాపు కల్యాణ మండపం కోసం రూ. 50లక్షల నిధులు కేటాయించిందని, మున్నూరు కాపుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
టీఆర్ఎస్ కాపులకు అధిక ప్రాధాన్యతం ఇస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నడూ కాపుల సంక్షేమం గురించి పట్టించు కోలేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కాపులకు అధిక ప్రాధాన్యతం లభించిందన్నారు. అనంతరం మున్నూరు కాపులు ఎమ్మెల్యే రేగాను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు ఎడవల్లి వెంకటయ్య, కృష్ణ మోహన్, నాగేశ్వరరావు, వీ వెంకట రామారావు, కవిత, గాజుల రమేశ్, బేతంచర్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పినపాక ప్రభుత్వ విప్ రేగా కాంతారావు శుక్రవారం సందర్శించారు. కళాశాల ఆవరణలోని పరిసరాలను, ప్రాంగణాన్ని పరిశీలించారు. కళాశాల నెలకొన్న సమస్యలను ప్రిన్సిపాల్ బీ శ్రీనివాస్ రేగాకు వివరించారు. సమస్య పరిష్కారానికి అన్ని విధాల తన వంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. పల్లె ప్రగతి కళాశాలలో నిర్వహించి కళాశాల పరిసరాల వాతావరణాన్ని మార్చాలని ఆయన సూచించారు.
పట్టణంలోని అన్నారం, బాపణకుంట గ్రామాల్లో అంగన్వాడీ నూతన భవనాలు, అన్నారంలో పశు సంరక్షణ ఉప కేంద్రాన్ని రేగా కాంతారావు శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఈ ప్రాంత ప్రజలకు అందిస్తానన్నారు. కార్యక్రమంలో మణుగూరు ఎంపీపీ కారం విజయకుమారి, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, మున్సిపల్ కమిషనర్ కే మాధవి, సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరరావు, టీఆర్ఎస్ నాయకులు బొలిశెట్టి నవీన్, యాదగిరి, మట్టపల్లి సాగర్, ఉద్దండు, ముద్దంగుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.