సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారని, రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన బోనకల్లులో రూ.44 లక్షలతో నిర్మించిన గోడౌన్, షాపింగ్ కాంప్లెక్స్, గోవిందాపురం-ఎల్లో రూ.42 లక్షలతో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోడౌన్, మధిర మండలం ఖమ్మంపాడు గ్రామాల్లో రూ.42 లక్షలతో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోడౌన్‌ను ప్రారం భించారు. సొసైటీ చుట్టూ రూ.8 లక్షలతో నిర్మించనున్న ప్రహరీకి శంకుస్థాపన చేసి మాట్లాడారు. వ్యవసాయ రంగానికి సహకార వ్యవస్థ మూలస్తంభమని పేర్కొన్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు రైతులకు అండగా నిలుస్తున్నాయన్నారు. సొసైటీలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.
బోనకల్లు, మే 9: వ్యవసాయ రంగానికి సహకార వ్యవస్థ మూలస్తంభమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన బోనకల్లులో రూ.44 లక్షలతో నిర్మించిన గోడౌన్, షాపింగ్‌కాంప్లెక్స్, గోవిందాపురం-ఎల్లో రూ.42 లక్షలతో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోడౌన్‌ను, మధిర మండలం ఖమ్మంపాడు గ్రామాల్లో రూ.42 లక్షలతో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోడౌన్‌ను ప్రారంభించారు. సొసైటీ చుట్టూ రూ.8 లక్షలతో నిర్మించనున్న ప్రహరీకి శంకస్థాపన చేసి మాట్లాడారు.
ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు రైతులకు అండగా నిలుస్తున్నాయన్నారు. సొసైటీలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం గోడౌన్లు ఏర్పాటు చేస్తున్నదన్నారు. ఎరువులు, విత్తనాలు నిల్వలకు గోడౌన్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అనుబంధ షాపింగ్ కాంప్లెక్స్‌లతో అదనపు ఆదాయం గడించవచ్చన్నారు. ఈ ఏడాది డీసీసీబీ ద్వారా రూ.12 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. నష్టాల్లో ఉన్న బ్యాంకు ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తున్నదన్నారు. డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం మాట్లాడుతూ.. డీసీసీబీ ద్వారా 500 మంది రైతుల పిల్లల విదేశీ చదువులకు రూ.40 కోట్లు మంజూరు చేయించామన్నారు.
రైతుల అవసరాల నిమిత్తం మున్ముందు మరిన్ని గోడౌన్లు నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, బోనకల్లు సహకార సంఘం అధ్యక్షుడు చావా వెంకటేశ్వరరావు, లక్ష్మీపురం సహకార సంఘం అధ్యక్షుడు మాదినేని వీరభధ్రరావు, ఖమ్మంపాడు సహకార సంఘం అధ్యక్షుడు దొండపాటి వెంకటేశ్వరరావు, జిల్లా సహకారశాఖ అధికారి విజయకుమారి, ఆర్డీవో రవీంద్రనాథ్, ఎంపీపీలు కంకనాల సౌభాగ్యం, మెండెం లలిత, జడ్పీటీసీ మోదుగుల సుదీర్‌బాబు, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మకమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు బొమ్మెర రామ్మూర్తి, సర్పంచ్‌లు భుక్యా సైదానాయక్, దొండపాటి రుక్మిణమ్మ, సహకార సంఘం సభ్యులు, ఎంపీటీసీలు, డీసీసీబీ డైరెక్టర్లు పాల్గొన్నారు.