ఎస్ఐఆర్లో బీఎల్ఏలు పాల్గొనాలి
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో బూత్ లెవల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో పాల్గొనాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్లతో కలిసి ఖమ్మం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
- ఎన్యూమరేషన్ ఫారాలు పూరించడంలో ఓటర్లకు అవగాహన కల్పించాలి
- ఫారాల పంపిణీ 95 శాతం పూర్తయినందున డిజిటలైజేషన్ చేపడుతున్నాం
- రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్
మామిళ్లగూడెం, జూలై 1: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో బూత్ లెవల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో పాల్గొనాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్లతో కలిసి ఖమ్మం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో రానున్న 15 రోజులు కీలకమని, ఈ ప్రక్రియ విజయవంతానికి సహకరించాలని కోరారు.
ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి వాటిని పూరించిన తరువాత స్వీకరించి ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను చేపడుతున్నామని తెలిపారు. ఈ దశలో బూత్ లెవల్ ఏజెంట్లు ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి బూత్ స్థాయి అధికారులకు అందజేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 95.78 శాతం పూర్తయిందన్నారు. దీంతో డిజిటలైజేషన్ ప్రక్రియను చేపడుతున్నట్లు తెలిపారు.
రాజకీయ పార్టీల బీఎల్ఏలు క్రియాశీలకంగా ఉండి వివరాల సేకరణలో సహకరించాలని సూచించారు. ముసాయిదా ఓటరు జాబితా ఎవరి పేరు లేకపోయినా తప్పనిసరిగా అభ్యంతరం నమోదు చేయాలని, అభ్యంతరం నమోదు చేయకపోతే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రతి అర్హమైన ఓటరు ఓటు హక్కు కొనసాగేందుకు రాజకీయ పార్టీలు ఎన్నికల యంత్రాంగానికి సహకారంఅందించాలని కోరారు. ఎస్డీసీ సదానందం, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డీటీ అన్సారీ, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

