హ్యాపీ బర్త్ డే ‘సీఎం’ సార్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని బీఆర్ఎస్ నేతలు, అభిమానులు ఆకాంక్షించారు. పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు.
- ఖమ్మం నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు
- సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించిన శ్రేణులు, అభిమానులు
- ప్రత్యేక హోమాలు చేసిన అర్చకులు, కేకులు కట్ చేసిన పార్టీ కార్యకర్తలు
ఖమ్మం/ రఘునాథపాలెం/ ఖమ్మం వ్యవసాయం/ ఖమ్మం సిటీ, ఫిబ్రవరి 17: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని బీఆర్ఎస్ నేతలు, అభిమానులు ఆకాంక్షించారు. పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. వాడవాడలా బర్త్ డే కేక్‌లను కట్ చేసి రాష్ట్ర పాలనాధక్షుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కేసీఆర్ మరిన్ని బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఖమ్మం నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ తాతా మధు, ఆయన సతీమణి భవానీ, బీఆర్ఎస్ యువజన నేత చింతనిప్పు కృష్ణచైతన్య.. తలసేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదానం చేశారు. పభుత్వ వైద్యశాలలో రోగులకు అన్నదానం చేశారు. పండ్లు పంపిణీ చేశారు. మొక్కలు నాటారు. ధూప, దీప నివేదన అర్చక సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం బీకే బజార్లో అర్చకులు నవగ్రహ పూజ, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ తాతా మధు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. అనంతరం కార్మికులకు, రైతులకు స్వీట్లు అందజేశారు. సుమారు 3 వేల మంది హమాలీలు, రెల్లుడు కార్మికులు దుస్తులు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ కువైట్ ఎన్నారై సెల్ బాధ్యులు అభిలాష ఆధ్వర్యంలో శుక్రవారం కువైట్‌లో అక్కడి నిరుపేదలకు పండ్లు, కూరగాయలు అందజేశారు. నగర ఐసీడీఎస్ ప్రాజెక్టు నిజాంపేట సెక్టార్ మేదరిబజార్ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను అంగన్వాడీ సిబ్బంది జరుపుకున్నారు.

సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లూ జీవించాలంటూ హోమం చేస్తున్న డీడీఎన్ అర్చకులు
తొలుత కేంద్రంలోని చిన్నారుల చేత కేక్ కట్ చేయించారు. ఖమ్మంలోని మంత్రి అజయ్ క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు నిర్వహించిన సీఎం కేసీఆర్ బర్త్‌డే వేడుకల్లో కేక్ కట్ చేశారు. బాణాసంచా కాల్చి సుంబురాలు జరిపారు. ఎన్ఎస్పీ క్యాంపు వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అన్నం సేవా ఆశ్రమంలో అన్నదానం చేశారు.
ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు అందచేశారు. బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, బాలింతలకు అన్నదానం చేశారు. జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జిల్లా కోరుట ఆవరణలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఖమ్మం మెడికల్ కళాశాల ప్రాంగణంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బీ మాలతి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో డాక్టర్ బీ శ్రీనివాసరావు, డైటీషియన్ సూర్యపోగు మేరీ, వైద్యులు, సిబ్భంది కలిసి మొక్కలు నాటి సంబురాలు జరుపుకున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

