KCR Birthday Celebrations | గిరిజన తండా (Tribal Thandas) గ్రామ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు (KCR Birthday Celebrations) వినూత్న రీతిలో జరుపుకున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండల పరిధిలోని కస్నతాండలో జిల్లా పార్టీ అధ్యక్షుడు తాత మధుసూదన్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు సంబురంగా జరిగాయి.
రైతు పక్షపాతి కేసీఆర్ జన్మదిన వేడుకలను గిరిజన తండా గ్రామస్థులతో కలిసి రూరల్ మండల టిఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు ఆరుగాలంకరించి పండించిన మిర్చి పంటలో కేసీఆర్ అక్షరాలను పేర్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నాడు బీఆర్ఎస్ (టీఆర్ఎస్)సర్కార్ హయాంలో సాగు రైతుల సంక్షేమ పథకాల అమలు తీరును మరోసారి గుర్తు తెచ్చుకున్నారు.
రైతు బాంధవుడిగా, రైతు పక్షపాతిగా నాడు సీఎం కేసీఆర్ అనేక పథకాలు పెట్టి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తే నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని గిరిజన ప్రజలు మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, బీఆర్ఎస్ పార్టీ రూరల్ మండలాధ్యక్షుడు బెల్లం వేణు, మాజీ జెడ్పీటీసీ ఎండపల్లి ప్రసాద్ పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కస్నతాండ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
తండాలో కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఇలా..
KCR Birthday | ‘ప్రజల హృదయాల్లో నిలిచి.. మళ్లీ ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్’
Kothagudem | భార్యా పిల్లలను చూడ్డానికి అత్తగారింటికి వెళ్తే.. పెట్రోల్ పోసి నిప్పంటించారు..
KCR | కేసీఆర్ జోలికొస్తే నాలుక చీరేస్తాం రేవంత్ రెడ్డి : బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్