ఖమ్మం, నవంబర్ 25 : రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అన్నివిధాలా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, భవిష్యత్తు మనదేనని, కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు సూచించారు. సోమవారం ఆయన్ని ఫాంహౌస్‌లో కలిసిన సందర్భంగా వద్దిరాజుతో పార్టీ అంశాలపై ముచ్చటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ భవిష్యత్తు మనదేనని, కాంగ్రెస్ పార్టీపై ప్రజలు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయని తెలిపారు.
ప్రజలు కష్టాల్లో ఉన్నారని, వారికి అండగా నిలవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులపై ఉందని సూచించారు. కేసీఆర్ స్వయంగా కారు నడుపుతూ ఉండగా పక సీట్లో బీఆర్ఎస్ రాజ్యసభ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కూర్చుని ప్రయాణించారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి మహబూబాబాద్‌లో జరిగిన మహాధర్నా కార్యక్రమాలకు హాజరైన ఎంపీ వద్దిరాజు సాయంత్రానికి కేసీఆర్‌ను కలిసేందుకు ఫాంహౌస్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎంపీ వద్దిరాజును తన కారులో పకనే కూర్చోబెట్టుకుని వ్యవసాయ క్షేత్రంలోని వివిధ పంటలను పరిచయం చేస్తూ తను సాగు చేస్తున్న పంటల వివరాలను వివరించారు. కేసీఆర్‌తో ప్రత్యేకంగా గడపడం తను ఎన్నటికీ మరిచిపోనని ఎంపీ వద్దిరాజు తెలిపారు.