కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. స్వామివారికి అర్చకులు అభి షేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధ వారం తెల్లవారుజాము నుంచే కుటుంబ సమే తంగా ఆలయాలకు చేరుకున్న భక్తులు తమల పాకులు, అరటి దొప్పలపై గౌరమ్మలను ప్రతి ష్టించి పసుపు కుంకుమలు చల్లి ప్రమిదల్లో కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. కొబ్బెరికాయలు కొట్టి పరమ శివుడిని భక్తిప్రపత్తులతో కొలిచారు.
భద్రా చలం గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి నదీ దీపాలు వెలిగించారు. రామయ్యను దర్శించు కున్నారు. సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు చేపట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం రామాలయం, కూసుమంచి శివాలయం, ఖమ్మంలోని గుంటుమల్లేశ్వరస్వామి, తీర్థాల సంగమేశ్వరస్వామి, పెనుబల్లి ఇంద్రనీలాద్రీశ్వరస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సాయంత్రం ఆలయాలు, ఇళ్ల ముంగిళ్లలో మహిళలు దీపాలు వెలిగించి భక్తిభావాన్ని చాటుకున్నారు.
-నమస్తే నెట్వర్క్, నవంబర్ 5