కారేపల్లి, సెప్టెంబర్ 05 : ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో గల వారాంతపు సంతను కామేపల్లి మండల పరిధిలోని పండితాపురం గ్రామానికి చెందిన మేకల మహేశ్‌బాబు రూ.6.33 లక్షలకు దక్కించుకున్నాడు. స్థానిక సంత వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సంత బహిరంగ వేలం పాటను నిర్వహించారు. ఈ వేలం పాటలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు పోటీ పడగా మహేశ్ గతేడాది కంటే రూ.1.33 లక్షలు అధికంగా వెచ్చించి వేలం దక్కించుకున్నాడు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బందితో పాటు, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.