కారేపల్లి, జూలై 09 : కారేపల్లి మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాల ఎఫ్ఆర్ఎస్ హాజరు శాతంలో ఖమ్మం జిల్లాలోని 14 కేజీబీవీలలో ప్రథమ స్థానంలో నిలిచింది. కారేపల్లి కేజీబీవీ విద్యాలయంలో ఉన్న 129 మంది బాలికలు, 14 మంది ఉపాధ్యాయులకు గాను 90 శాతం ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు కావడంతో స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రశంసా పత్రాలను ఇచ్చారు. పాఠశాలలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో స్థానిక ప్రత్యేక అధికారి గద్దల ఝాన్సీ సౌజన్య చేతుల మీదుగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.