కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 20:‘ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రండి’ అంటూ కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి కోరారు. ఈ మేరకు తన భర్త, టీబీజీకేఎస్ నేత కాపు కృష్ణ సహా పార్టీ శ్రేణులతో కలిసి రామవరంలో ఆదివారం విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ‘రజతోత్సవానికి కుటుంబ సమేతంగా హాజరుకండి’ అంటూ బొట్టుపెట్టి మరీ ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచనల మేరకు రామవరంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని అన్నారు.
ఈ నెల 27న వరంగల్లో జరిగే పార్టీ రజతోత్సవంలో పార్టీ అధినేత కేసీఆర్.. భవిష్యత్ ప్రణాళికపై దిశానిర్దేశం చేయనున్నారని, ఈ సభకు వేలాదిగా తరలి వచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఖాజా భక్షి, షరీఫ్, మధుబాబు, జాన్, ఈశ్వరి, సుమ, రమ్యకృష్ణ, తమ్మిశెట్టి నాగమణి, పల్లవి, సుల్తానా, కతిజ, ఆషాపాసి, స్వాతి, నందిని, రాణి, వరలక్ష్మి, వాసుకి, మాలతీ, దేవీ, శైలజ, అప్పు, నవత, సుమలత తదితరులు పాల్గొన్నారు.